HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Naidu Gives Good News To Auto Drivers

CM Chandrababu: ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పిన సీఎం.. ద‌స‌రా రోజు రూ. 15 వేలు!

అన్నదాత సుఖీభవ, దీపం-2 విజయాలు రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని, అందుకే అన్నదాత సుఖీభవ పథకం తెచ్చామని చంద్రబాబు తెలిపారు.

  • Author : Gopi Date : 10-09-2025 - 4:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP Government
AP Government

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల అమలు వేగంగా సాగుతోంది. దసరా పండుగ రోజున ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించే ‘వాహన మిత్ర’ పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ప్రకటించారు. దసరా రోజున అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ. 15,000 అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్ విజయోత్సవ సభ’లో వెల్లడించారు. ఈ సభకు భారీగా తరలివచ్చిన మూడు పార్టీల శ్రేణులకు, ప్రజలకు, మహిళలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

సూపర్ సిక్స్ పథకాలపై వివరణ

ఈ సభ కేవలం రాజకీయాలు, ఎన్నికలు, ఓట్ల కోసం కాదని, 15 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికే ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. “సూపర్ సిక్స్ పథకాలను- సూపర్ హిట్ చేశారని చెప్పడానికే ఈ సభ” అని ఆయన అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను గత పాలకులు హేళన చేశారని, ఇప్పుడు వాటిని విజయవంతంగా అమలు చేసి చూపించామని అన్నారు. పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, మెగా డీఎస్సీ, దీపం పథకం, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలపై గతంలో విమర్శలు చేశారని, అయితే కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని చంద్రబాబు అన్నారు.

Also Read: France: ఫ్రాన్స్‌లో ‘బ్లాక్ ఎవ్రీథింగ్’ నిరసనలు.. 200 మంది అరెస్ట్!

నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని వెనక్కి రప్పించే ప్రయత్నాలు

ప్రస్తుతం నేపాల్‌లో జరుగుతున్న ఆందోళనల కారణంగా 200 మంది తెలుగువారు చిక్కుకుపోయారని, వారిని స్వస్థలాలకు సురక్షితంగా తీసుకువచ్చే బాధ్యతను మంత్రి లోకేష్‌కు అప్పగించినట్లు చంద్రబాబు తెలిపారు. లోకేష్ ‘రియల్ టైమ్ గవర్నెన్స్’ ద్వారా ప్రతి క్షణం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, వారిని తిరిగి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

గత పాలనపై విమర్శలు

గత ప్రభుత్వ పాలనను ఉద్దేశిస్తూ ప్రజా వేదికను కూల్చివేతతో మొదలుపెట్టి, అవినీతి, అప్పులు, తప్పుడు కేసులతో రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టారని చంద్రబాబు ఆరోపించారు. పెట్టుబడులను తరిమేసి, పరిశ్రమలు రాకుండా చేశారని, 93 పథకాలను నిలిపివేశారని ఆయన విమర్శించారు. పేద, మధ్యతరగతి జీవితాలను మార్చేందుకు తాము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామని, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేశామని చంద్రబాబు అన్నారు.

అన్నదాత సుఖీభవ, దీపం-2 విజయాలు రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని, అందుకే అన్నదాత సుఖీభవ పథకం తెచ్చామని చంద్రబాబు తెలిపారు. కేంద్రంతో కలిసి ఏడాదికి మూడు విడతల్లో రూ. 20 వేలు ఇస్తామని చెప్పామని, మొదటి విడతగా ఇప్పటికే 47 లక్షల మంది రైతులకు రూ. 3,173 కోట్లు జమ చేశామని అన్నారు. రైతన్నలకు యూరియా కొరత రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే దీపం-2 పథకం ద్వారా మహిళలకు ఏటా మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నామని, ఇప్పటికే రూ. 1704 కోట్లు ఖర్చు చేసి 2.45 కోట్ల సిలిండర్లు పంపిణీ చేశామని వివరించారు. ఈ పథకాలన్నీ ‘సూపర్ హిట్’ అయ్యాయని ఆయన పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Auto Drivers
  • CM Chandrababu
  • Super Six
  • telugu news

Related News

The people are the ultimate arbiters of a historic victory: Deputy CM Pawan.

Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, వారి తీర్పును మించిన శక్తి ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వ మార్పునకు మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశను నిర్దేశించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం కోసం ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున

    Latest News

    • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

    • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

    • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

    • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

    • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd