CM Chandrababu : ఏపీలో 26 జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను నియమించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu : నిమ్మలకు తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. గొట్టిపాటి రవికి పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. అనగానికి సత్యసాయి, తిరుపతి జిల్లాల బాధ్యతల అప్పగించింది చంద్రబాబు ప్రభుత్వం.
- By Latha Suma Published Date - 12:39 PM, Tue - 15 October 24
AP Districts In charge Ministers : ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని 26 జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం…అధికారిక ప్రకటన చేసింది. పలువురు మంత్రులను రెండేసి జిల్లాలకు ఇన్ఛార్జీగా నియమించింది ఏపీ ప్రభుత్వం. అచ్చెన్నాయుడుకు మన్యం, కోనసీమ జిల్లాల ఇన్ఛార్జీ బాధ్యతల అప్పగించారు.
నిమ్మలకు తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. గొట్టిపాటి రవికి పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. అనగానికి సత్యసాయి, తిరుపతి జిల్లాల బాధ్యతల అప్పగించింది చంద్రబాబు ప్రభుత్వం. పవన్ కళ్యాణ్, లోకేష్ లకు ఇన్ఛార్జీ బాధ్యతలు ఇవ్వకపోడంతో నలుగురు మంత్రులకు రెండేసి జిల్లాల బాధ్యతల అప్పగించారు. జనసేన మంత్రులకు ఏలూరు, గుంటూరు జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. బీజేపీ మంత్రికి ఎన్టీఆర్ జిల్లా బాధ్యతలను అప్పగించారు.
అతేకాకుండా ఆయా జిల్లాల నేతల మధ్య గ్యాప్‌ను తగ్గించే బాధ్యతను కూడా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులకు అప్పగించారు. ప్రజలకు ప్రభుత్వానికి కళ్లు, చెవులు మాదిరిగా ఉంటూ కార్యక్రమాలు విజయవంతం చేయడమే వీరి లక్షం. ఈ మేరకు 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.