Chandrababu : ఆర్థికశాఖ పై దృష్టి సారించిన ఏపి ముఖ్యమంత్రి
- By Latha Suma Published Date - 02:07 PM, Wed - 10 July 24

Finance Department : ఏపి సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆర్థికశాఖ(Finance Department) పై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తాజాగా ఉన్న ఆర్థిక పరిస్థితిపై అధికారులతో ఆయన చర్చించారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి రూ.14 లక్షల కోట్లు అని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇదే విషయాన్ని వారు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు.
We’re now on WhatsApp. Click to Join.
పెండింగ్ బిల్లులు(Pending bills) ఎన్ని ఉన్నాయనే అంశంపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో, ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ శాఖల వారీగా పెండింగ్ బిల్లుల వివరాలు కోరింది. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలు, కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై ఫోకస్ పెట్టింది. త్వరలోనే చంద్రబాబు ఆర్థిక శాఖ పై శ్వేతపత్రం(White Paper on Finance) విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఆయన ఈ దిశగా కసరత్తలు చేస్తున్నారు.
Read Also: Polimera 3 : గూస్‌బంప్స్.. ‘పొలిమేర-3’పై కీలక ఆప్డేట్..
మరోవైపు పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్(Otan Account Ordinance) ప్రవేశ పెట్టాలని ఆర్థిక శాఖ సీంఎ చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టే అంశంపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక శాఖపై విడుదల చేయాల్సిన శ్వేత పత్రంపై సీఎం దృష్టి సారించారు. దీంతో పాటు మధ్యాహ్నం 3. 30 గంటలకు ఎక్సైజ్ శాఖ మీద కీలక సమీక్ష చేయనున్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీ, గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత బీపీసీఎల్ ఛైర్మన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు.
Read Also: Rahul Dravid : రూ. 2.5 కోట్ల అదనపు బోనస్‌ను తిరస్కరించిన ద్రవిడ్