Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Andhra-pradesh News
  • ⁄Cji Opens Special Courts For Red Sanders Cases

Red Sandal : ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ పై రెండు ప్ర‌త్యేక కోర్టులు

ఎర్రచందనం అక్రమ రవాణా పై న‌మోద‌వుతోన్న కేసుల త‌క్ష‌ణ‌ పరిష్కారం కోసం రెండు ప్రత్యెక కోర్టులు తిరుప‌తి కేంద్రంగా ప్రారంభం అయ్యాయి.

  • By CS Rao Published Date - 09:00 PM, Thu - 9 June 22
Red Sandal : ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ పై రెండు ప్ర‌త్యేక కోర్టులు

ఎర్రచందనం అక్రమ రవాణా పై న‌మోద‌వుతోన్న కేసుల త‌క్ష‌ణ‌ పరిష్కారం కోసం రెండు ప్రత్యెక కోర్టులు తిరుప‌తి కేంద్రంగా ప్రారంభం అయ్యాయి. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకొని శేషాచల అడవులను పరిరక్షించాల‌ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యెన్ వి రమణ సూచించారు. ఎర్రచందనం అక్రమ రవాణా పై సత్వర పరిష్కారం కొరకు రెండు ప్రత్యెక కోర్టులు తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందనీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యెన్ వి రమణ అన్నారు. స్థానిక ఎస్ వి యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యెన్ వి రమణకు జరిగిన అభినందన సభలో వారు మాట్లాడుతూ తిరుపతికి రావడం ఆ వేంకటేశుని దర్శించుకోవడం కోసం ఏ అవకాశం వచ్చిన మహా భాగ్యంగా భావిస్తానని సుప్రీ౦ కోర్ట్ అఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ నూతనపాటి వెంకట రమణ తెలిపారు.

ఎర్రచందనం అక్రమ రవాణా నివారించడం కోసం రెండు ప్రత్యేక న్యాయస్థానాలు ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందన్నారు. అత్యంత విలువైన ఎర్రచందనం తిరుపతి శేషాచలం అడవులలో మాత్రమే దొరుకుతుందని, ఎర్రచందనం ప్రపంచంలోనే అత్యంత విలువైనదని అసాధారణమైన రంగు , అత్యంత ఔషధ గుణాలు కలిగినందునే ఎర్రచందనంను ఎర్రబంగారంగా మార్చారని అన్నారు. అందువలనే ఈ ఎర్ర చందనం కి సంబంధించి చాల సమస్యలు రావడం జరిగింది అని తెలిపారు. ఈ ఎర్రచందనం దాదాపు 5300 చ.కిమీ దూరం వరకు వేలసంఖ్యలో ప్రకృతి సిద్ధంగా విస్తరించి ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ కోట్లు పలుకుతోందని అన్నారు. గత దశాబ్ద కాలంగా దీనిని స్మగ్లర్లు అక్రమ మార్గాల ద్వారా నరికి విదేశాలకు ఎగుమతి చేసే కార్యక్రమాన్ని ఒక వృత్తిలాగా చేపట్టి అక్రమార్జనకు అలవాటు పడ్డారని అన్నారు.

అటవీ పర్యావరణాన్ని మరియు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని అన్నారు. ఈ మూడు దశాబ్దాలలో ఎర్రచందనం 30 నుండి 50 శాతం వృక్షాలను కొట్టివేయడం జరిగిందని అన్నారు. దురదృష్ట వశాత్తు చట్టంలోని బలహీనతలు సరైనటువంటి పటిష్టమైన న్యాయవ్యవస్థ లేకపోవడం, తక్కువ శిక్షలతో బయటపడతామనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో దీనివైపు ఆకర్షితులై ఈ అక్రమ రవాణా కు పాల్పడుతున్నారని తెలిపారు. గతంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే 1 సం జైలు శిక్ష 10 వేలు జరిమానా ఉండేది. దీనితో స్మగ్గ్లింగ్ చేసే ముఠాలు పెద్ద సంఖ్యలో స్మగ్గ్లింగ్ కు పాల్పడే వారి కుటుంబాలకు అండగా నిలిచి వారిని పోషించి వారు శిక్ష నుండి బయటకు రాగానే యధావిధిగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. తుడా కాంప్లెక్స్ లో తక్కువ ఆద్దేకే ఇచ్చి ఈ కోర్టుల ఏర్పాటు కి సహకరించిన చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి శాసన సభ్యులు కరుణాకర రెడ్డికి అభినంద‌న‌లు తెలిపారు.

Tags  

  • nv ramana
  • red sanders

Related News

తెలంగాణ సీఎస్ పై సుప్రీం చీఫ్ జ‌స్టిస్ అస‌హ‌నం

తెలంగాణ సీఎస్ పై సుప్రీం చీఫ్ జ‌స్టిస్ అస‌హ‌నం

తెలుగు రాష్ట్రాల్లోని ప‌రిస్థితుల‌పై సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ తీవ్రంగా స్పందించారు. ప్ర‌ధానంగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ పై సీఎంల‌, హైకోర్టు జ‌డ్జిల స‌మావేశంలో ఫైర్ అయ్యారు.

  • NV Ramana : స్థానిక భాష‌ల్లో ‘న్యాయం’

    NV Ramana : స్థానిక భాష‌ల్లో ‘న్యాయం’

  • The people’s judge:సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా ఏడాది ప‌ద‌వీకాలం పూర్తి చేసుకున్న ఎన్వీర‌మ‌ణ‌… న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో ఎన్నో సంస్క‌ర‌ణ‌లు..?

    The people’s judge:సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా ఏడాది ప‌ద‌వీకాలం పూర్తి చేసుకున్న ఎన్వీర‌మ‌ణ‌… న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో ఎన్నో సంస్క‌ర‌ణ‌లు..?

  • CJI Ramana:నా రిటైర్మెంట్ తర్వాత ప్రణాళిక గురించి ఆలోచించలేనంత బిజీగా ఉన్నాను – సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌

    CJI Ramana:నా రిటైర్మెంట్ తర్వాత ప్రణాళిక గురించి ఆలోచించలేనంత బిజీగా ఉన్నాను – సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌

  • CJI Ramana: న్యాయమూర్తుల పరువును తీసేలా వ్యవహరిస్తారా?

    CJI Ramana: న్యాయమూర్తుల పరువును తీసేలా వ్యవహరిస్తారా?

Latest News

  • Gym: ఇంటర్నెట్లో క్లిక్ కొట్టు.. ఇంట్లోనే ఫిట్నెస్ పై పట్టు!!

  • Taapsee: నన్ను నేను గిల్లి మరీ చెక్ చేసుకుంటున్నా.. షారుఖ్ తో “డంకీ”పై తాప్సీ

  • Skanda Panchami : నేడు స్కందపంచమి…ఈ పరిహారాలు చేస్తే పెళ్లి అడ్డంకులు తొలగిపోతాయి..!!

  • Amarnath Yatra: ప్రశాంతంగా సాగుతున్న అమరనాథ్ యాత్ర.. 200 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో గస్తీ

  • PM Modi : మోదీ నోట భాగ్యనగర్ మాట…పేరు మార్పుపై మొదలైన చర్చ..!!

Trending

    • Viral Video : మొసలితో మేయర్ మ్యారేజ్!

    • Viral video : కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో రిక్షావాలా.. కొత్త చెప్పులిచ్చిన కానిస్టేబుల్ !

    • BJP Then and Now: 2004లోనూ హైదరాబాద్ లోనే బీజేపీ సమావేశాలు.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి?

    • Clouds on Mars: మార్స్ పైన మేఘాలని కనిపెట్టండి.. నాసా పోస్ట్ వైరల్!

    • Alimony: హింసించిన భార్య.. 83 ఏళ్ళ భర్తకు భార్య భరణం ఇవ్వాలంటూ కోర్టు తీర్పు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: