TDP Anakapalli MP Candidate : అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా చింతకాయల విజయ్..?
తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. 2024లో అధికారమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతుంది. ఇప్పటికే యువగళం
- Author : Prasad
Date : 25-12-2023 - 10:08 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. 2024లో అధికారమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతుంది. ఇప్పటికే యువగళం సక్సెస్ జోష్‌తో ఉన్న టీడీపీ అభ్యర్థులను ప్రకటించేందకు సిద్ధమవుతుంది. సంక్రాంతి తరువాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటు పార్లమెంట్ అభ్యర్థులను కూడా ఇప్పటికే ఖరారు చేస్తుంది. విజయవాడ, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థులకు సిట్టింగ్‌లుగా ఉన్న కేశినేని నాని, రామ్మోహన్ నాయుడులను మరోసారి బరిలోకి దింపతుంది. గుంటూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ పోటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ప్లేస్‌లో లగడపాటిని పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తుంది. ఇటు ఉత్తరాంధ్రలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలవాలని టీడీపీ భావిస్తుంది. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి మాజీ మంత్రి చింతకాయల అయన్నపాత్రుడు కుమారుడు విజయ్‌ని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే పలు సర్వేలు నిర్వహించిన అధిష్టానం.. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా విజయ్‌ని ఫైనల్ చేసింది. ఇటీవల యువగళం పాదయాత్ర అనకాపల్లిలో జరగగా.. లోకేష్ కూడా విజయ్‌ని ఎంపీ అభ్యర్థిగా యాత్రలో ప్రమోట్ చేశారు. ఉన్నత విద్యావంతుడు కావడం, సమస్యలపై అవగాహన, ఏ విషయాన్ని అయిన అనర్గళంగా మాట్లాడగలిగే విజయ్‌ని పార్లమెంట్‌కి పంపితే రాష్ట్ర సమస్యలపై గళం విప్పుతాడని టీడీపీ భావిస్తుంది. ఇప్పటికే ఉన్న ఎంపీలతో పాటు యువనాయకులను పార్లమెంట్‌కు పంపాలని టీడీపీ యోచిస్తుంది. వైజాగ్ నుంచి గీతం యూనివర్సిటీ భరత్ ను మరోసారి పోటీ చేపిస్తుంది. గతంలో వైజాగ్ పార్లమెంట్ నుంచి జనసేన కూడా పోటీ చేయడంతో ఇక్కడ ఓట్లు చీలి వైసీపీ గెలిచింది. ఈ సారి పొత్తుతో వైజాగ్ ఎంపీ స్థానం టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది.
Also Read: TDP : ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ టీడీపీకి బోనస్ – ఆనం వెంకటరమణారెడ్డి