HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chief Minister Chandrababu Reviews Aerospace And Defense Policy

CM Chandrababu: ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష!

ఈ తరహా సాంకేతికతను రక్షణపరంగా వాడుకోవడంతో పాటు.. వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి, దైనందిన జీవితంలో కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. దేశ రక్షణ, అంతర్గత శాంతి భద్రతలకు సంబంధించి భవిష్యత్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయని... ఈ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు నూతన పాలసీ దోహదపడాలని సీఎం అన్నారు.

  • By Gopichand Published Date - 02:58 PM, Mon - 23 June 25
  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu

CM Chandrababu: రక్షణ, అంతరిక్ష రంగంలో రాష్ట్రం భారీగా పెట్టుబడులు ఆకట్టుకునేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 (2025-2030)పై ముఖ్యమంత్రి సమీక్షించారు. నూతనంగా తీసుకువచ్చే పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.50 వేల కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. రక్షణ, ఏరోస్పేస్ రంగంలో నూతన సాంకేతికత, నవీన ఆవిష్కరణలకు రాష్ట్రం కేంద్రంగా మారేలా ప్రయత్నించాలన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో భారతదేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిందని, రానున్న రోజుల్లో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.

ఈ తరహా సాంకేతికతను రక్షణపరంగా వాడుకోవడంతో పాటు.. వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి, దైనందిన జీవితంలో కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. దేశ రక్షణ, అంతర్గత శాంతి భద్రతలకు సంబంధించి భవిష్యత్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయని… ఈ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు నూతన పాలసీ దోహదపడాలని సీఎం అన్నారు. నేషనల్ సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇచ్చేలా పలు మార్పులు సూచించారు. ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు హాజరై పలు సూచనలు చేశారు.

Also Read: Kajol : ఘోస్ట్ హౌస్ లా అనిపించింది.. రామోజీ ఫిల్మ్ సిటీపై కాజోల్ షాకింగ్ కామెంట్స్!

ఎంఎస్ఎంఈ ఉత్పత్తులకు నాణ్యతా బెంచ్‌మార్క్

మిగతా రాష్ట్రాల కంటే ఈ రంగంలోని ఎంఎస్ఎంఈలను ప్రత్యేకంగా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం ఏడాదికి ప్రత్యేకంగా రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడంతో పాటు, లాజిస్టిక్స్ సబ్సిడీ వంటివి నూతన పాలసీలో పొందుపర్చాలని సూచించారు. ‘ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయాలి. అనుంబంధ పరిశ్రమలలో ఉత్పత్తుల నాణ్యతలో బెంచ్‌మార్క్ ఉండేలా చూడాలి. అలాగే విలువ జోడింపు జరగాలి. మార్కెటింగ్-బ్రాండింగ్ ముఖ్యం. వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్ ఆశయం సాకారం కావాలి.’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

ప్రాంతాలవారీగా డిఫెన్స్, ఏరోస్పేస్ పరిశ్రమలు

విశాఖపట్నం-శ్రీకాకుళంలో నావల్ క్లస్టర్.. జగ్గయ్యపేట-దొనకొండ ప్రాంతంలో మిస్సైల్, ఆయుధాల ఉత్పత్తులు…. కర్నూలు-ఓర్వకల్లులో మానవ రహిత విమానాలు, డ్రోన్ల తయారీ… లేపాక్షి-మడకశిర క్లస్టర్‌లో ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్…. పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, తిరుపతిని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్‌గా తీర్చిదిద్దాలని, అలాగే డీఆర్డీవో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నెలకొల్పాలని ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు మడకశిర క్లస్టర్‌లో భారత్ ఫోర్జ్, ఎంఎండబ్ల్యు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే శంకుస్థాపన చేయనున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

రాష్ట్రంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన 23 సంస్థలు

జాతీయ రక్షణ ఉత్పత్తుల విలువ ఏడాదికి రూ.1.27 లక్షల కోట్లు ఉండగా, ఇందులో రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థల వాటా 73 శాతం కలిగి ఉన్నాయి. 21 శాతం విలువైన ఉత్పత్తులు ప్రైవేట్ రంగం నుంచి వస్తున్నాయి. మిగిలిన 7 శాతం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఉత్పత్తి అవుతున్నాయి. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ క్లస్టర్‌లో 23 సంస్థలు, రూ.22 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. దీంతో 17 వేల మందికి ఉపాధి లభించింది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, వాణిజ్య-పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ పాల్గొన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aerospace- Defense Policy
  • andhrapradesh news
  • CM Chandrababu
  • Kutami Sarkar
  • nda govt

Related News

CM Chandrababu

Chandrababu Naidu: అసెంబ్లీకి గైర్హాజరైన ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్‌

గురువారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన సమయంలో సభలో కేవలం 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు

  • CM Chandrababu Naidu

    CM Chandrababu Naidu: తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు.. రేపు, ఎల్లుండి పర్యటన!

  • CM Chandrababu Naidu

    Agriculture : ఎమ్మెల్యేలు పొలాలకు వెళ్లండి.. చంద్రబాబు సూచన

  • Made In India Products Chan

    Made in India Products : మేడ్ ఇన్ ఇండియా వస్తువుల్నే కొనాలి – CBN

  • Elections

    Elections: మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు?

Latest News

  • IPS Transfer : తెలంగాణ లో 23 మంది ఐపీఎస్‌లు బ‌దిలీ

  • ‎Papaya Juice: ఉదయాన్నే పరగడుపున బొప్పాయి జ్యూస్ తాగవచ్చా.. తాగితే ఏమవుతుందో మీకు తెలుసా?

  • MGBS : నీట మునిగిన ఎంజీబీఎస్..తాళ్ల సాయంతో బయటకు ప్రయాణికులు

  • Musi River : మూసీ ఉగ్రరూపం..కట్టుబట్టలతో పరుగులు తీస్తున్న స్థానికులు

  • ‎Banana: అరటిపండు ఎప్పుడు తింటే మంచిది ఉదయమా లేక రాత్రినా!

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd