Chandrabau Case : సుప్రీం బాట పట్టబోతున్న చంద్రబాబు లాయర్లు
చంద్రబాబు పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేయడం తో ...చంద్రబాబు తరపు లాయర్లు సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
- By Sudheer Published Date - 02:21 PM, Fri - 22 September 23

స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Case)లో టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) కు భారీ షాక్ తగిలింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబుపై నమోదు చేసిన కేసు రిమాండ్ రిపోర్టును క్వాష్ (Chandrababu Quash Petition) చేయాలని కోరుతూ ఆయన తరఫున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..హైకోర్టు మాత్రం CID వాదనలకే మొగ్గు చూపిస్తూ..చంద్రబాబు పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో చంద్రబాబు తరపు లాయర్లు సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది.
ఇక క్వాష్ పిటిషన్ (Chandrababu Quash Petition) ఫై చంద్రబాబు తరుపు లాయర్లు ఏ వాదనలు చేసారు..CID తరుపు లాయర్లు ఏ వాదనలు చేశారనేది చూద్దాం.
చంద్రబాబు తరుపున న్యాయవాదులు లూథ్రా, హరీష్ సాల్వే (Lawyers Sidharth Luthra, Harish Salve) లు..ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోవడమే కాకుండా.. గవర్నర్ అనుమతి కూడా తీసుకోలేదని, చట్ట విరుద్ధంగా చంద్రబాబును అరెస్ట్ చేయడం సరికాదని హైకోర్టు కు తమ వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లుగా ఎక్కడా ఆధారాలు చూపలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే తరహా సెక్షన్ల కేసుల్లో హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు, మార్గదర్శకాలను లాయర్స్ ప్రస్తావించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు కేసును క్వాష్ చేయాలని కోరారు.
సీఐడీ తరఫున న్యాయవాదులు ముఖుల్ రోహిత్గీ, ఏఏజీ సుధాకర్ రెడ్డి (Lawyers Mukul Rohatgi, Sudhakar Reddy) వాదనలు చూస్తే.. సెక్షన్ 319 ప్రకారం విచారణ సంస్థ ఎన్నిసార్లు అయినా ఛార్జ్ షీట్లు దాఖలు చేసే అవకాశం ఉంటుందని, ఎంత మందిని అయినా విచారించొచ్చని కోర్ట్ కు తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం, ఒప్పందానికి అనుగుణంగా స్కిల్ డెవలప్‌మెంట్ పాలసీ జరుగలేదని కోర్టుకు వివరించారు. కేవలం దురుద్దేశ్యంతోనే.. రూ. 371 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వారు గట్టిగా కోర్ట్ కు ఆరోపించారు. ఇక గవర్నర్‌కు సమాచారం ఇవ్వకపోడంపై వివరణ ఇచ్చిన సీఐడీ తరఫున న్యాయవాదులు.. ఆయన ఎమ్మెల్యే మాత్రమేనని, బాబు అరెస్ట్‌పై స్పీకర్‌కు సమాచారం ఇచ్చామని తెలిపారు.
Read Also : CID Team at Delhi : లోకేష్ అరెస్ట్ కు ఢిల్లీకి ఏపీ సీఐడీ.!