CID Team at Delhi : లోకేష్ అరెస్ట్ కు ఢిల్లీకి ఏపీ సీఐడీ.!
CID Team at Delhi : తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్దం అయింది. ఏపీ సీఐడీ ఢిల్లీ వెళ్లారు.
- Author : CS Rao
Date : 22-09-2023 - 1:56 IST
Published By : Hashtagu Telugu Desk
CID Team at Delhi : తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్దం అయింది. ఆయన కోసం ఏపీ సీఐడీ ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లారు. ఎనిమిది మంది బృందం ఢిల్లీ వెళ్లిందని విశ్వసనీయంగా తెలుస్తోంది. సుప్రీం కోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరపడానికి వెళ్లారని కొందరు అంటున్నారు. కాదు, లోకేష్‌ను అరెస్ట్ చేయడానికి ప్రణాళిక ప్రకారం ఏపీ సీఐడీ టీమ్ ఢిల్లీ వెళ్లిందని మరికొందరు చెబుతున్నారు. మొత్తం మీద లోకేష్ ను అరెస్ట్ చేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
చంద్రబాబు జైలు ఎపిసోడ్ ను మరిపించేలా..(CID Team at Delhi )
రాజమండ్రి జైలుకు చంద్రబాబును పంపిన తరువాత జగన్మోహన్ రెడ్డి రివ్యూ మీటింగ్ పెట్టారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఆయన లండన్ వెళ్లిన తరువాత చంద్రబాబు అరెస్ట్ జరిగింది. పది రోజుల లండన్ పర్యటన గురించి ఏ మాత్రం బయటకు రాకుండా చంద్రబాబు అరెస్ట్ ను తెరమీదకు తీసుకొచ్చారు. ప్రత్యేక విమానంలో లండన్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్లారు? అనేది ఇప్పుడు ఎవరూ మాట్లాడుకోవడంలేదు. ఏ ఇద్దరు తెలుగు వాళ్లు కలిసినప్పటికీ చంద్రబాబు జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తారు? అనేదే ప్రస్తావన. అదే, జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ సానుభూతి దిశగా వెళుతోందని జగన్మోహన్ రెడ్డి అంతర్గత సర్వేల సారాంశం. అందుకే, చంద్రబాబు జైలు ఎపిసోడ్ ను మరిపించేలా లోకేష్ అరెస్ట్ ను (CID Team at Delhi) తీసుకురావడానికి ప్లాన్ చేశారని వినికిడి.
ఫైబర్ నెట్ కేసును ఏపీ సీఐడీ ఓపెన్
రిమాండ్ రూపంలో 14 రోజుల క్రితం చంద్రబాబు జైలులో ఉన్నారు. మరో రెండు రోజులు ఏసీబీ కోర్టు రిమాండ్ ను పొడిగించింది. తొలి నాలుగు రోజులు లోకేష్ చంద్రబాబుతోనే ఉన్నారు. లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాత పెట్టిన రివ్యూ మీటింగ్ సారాంశాన్ని తెలుసుకున్న తరువాత ఢిల్లీ వెళ్లారు. గత వారం రోజులుగా ఆయన అక్కడే ఉంటున్నారు. స్కిల్ డవలెప్మెంట్ ప్రోగ్రామ్ లో అవినీతి జరగలేదని జాతీయ మీడియాలో వాదనలను వినిపించారు. డిస్కషన్లకు వెళ్లారు. నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆయన మీద ఫైబర్ నెట్ కేసును ఏపీ సీఐడీ ఓపెన్ చేసింది. ఆ కేసులో ఆయన్ను (CID Team at Delhi) అరెస్ట్ చేయడానికి సర్వం సిద్ధం చేసింది.
Also Read : Jagan Delhi sketch : `ఆపరేషన్ గరుడ`కు ఢిల్లీలో జగన్ పదును?
మరో వైపు వారం రోజులుగా భువనేశ్వరి, బ్రాహ్మణి రాజమండ్రిలోనే ఉంటున్నారు. అక్కడి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సహాయసహకారాలు అందిస్తున్నారు. క్యాడర్ కు ధైర్యం చెబుతున్నారు. అరెస్ట్ ను నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీ చేయడం ద్వారా ప్రజా మద్ధతును కూడగట్టారు. పార్టీ కోసం తామున్నామంటూ క్యాడర్ కు మనోధైర్యాన్ని నూరిపోస్తున్నారు. మొత్తం మీద లోకేష్ ను కూడా జైలుకు పంపడానికి సర్వత్రా సిద్దం చేసిన జగన్మోహన్ రెడ్డి సర్కార్ రాబోవు రోజుల్లో ఏమి చేస్తుంది? అనేది చూడాలి.
Also Read : Jagan in Trouble : చంద్రబాబుకు సానుభూతి వెల్లువ, సీ ఓటర్ సర్వే తేల్చివేత