Chandrababu – CID Questioning : చంద్రబాబును రెండో రోజూ విచారిస్తున్న సీఐడీ.. నేటితో ముగియనున్న రిమాండ్ గడువు
Chandrababu - CID Questioning : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును వరుసగా రెండో రోజు (ఆదివారం) సీఐడీ విచారించడం మొదలుపెట్టింది.
- By Pasha Published Date - 11:02 AM, Sun - 24 September 23

Chandrababu – CID Questioning : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును వరుసగా రెండో రోజు (ఆదివారం) సీఐడీ విచారించడం మొదలుపెట్టింది. ఇవాళ ఉదయం తొలుత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి, రాజమండ్రి సెంట్రల్ జైలులోని కాన్ఫరెన్స్ హాలులో విచారణ మొదలుపెట్టారు. ఈ విచారణలో మొదటి రోజు 5 గంటల వ్యవధిలో 50 ప్రశ్నలు అడిగిన సీఐడీ ఆఫీసర్లు.. ఈరోజు ఎన్ని అడుగుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also read : Farmer Ganesha : జయములివ్వు ‘రైతు గణేశా’.. ఫొటోలు వైరల్
12 మంది ఆఫీసర్ల టీమ్ రెండు బ్యాచ్ లుగా విడిపోయి.. ఉదయం ఒక ఆఫీసర్ల బ్యాచ్, మధ్యాహ్నం ఒక ఆఫీసర్ల బ్యాచ్ వచ్చి చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రశ్నిస్తున్నాయి. ఏపీ స్కిల్ కేసుతో ముడిపడిన డాక్యుమెంట్లను ముందు పెట్టి ప్రశ్నలు అడుగుతున్నాయి. చంద్రబాబుకు చెందిన ఒక లాయర్ కూడా అక్కడ అందుబాటులో ఉంటున్నారు. మొత్తం విచారణ ప్రక్రియను కెమెరాతో షూట్ చేస్తున్నారు. అనంతరం దీన్ని కోర్టులో సబ్మిట్ చేయనున్నారు. ఈరోజుతో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు ఇచ్చిన రెండు రోజుల కస్టడీ గడువు ముగియనుంది. రెండు రోజుల రిమాండ్ పొడిగింపు కూడా నేటితో క్లోజ్ కానుంది. దీంతో ఈరోజు సాయంత్రం సీఐడీ అధికారులు చంద్రబాబును ఏసీబీ కోర్టు ఎదుట వర్చువల్‌గా (Chandrababu – CID Questioning) హాజరుపర్చనున్నారు.