world cup 2023: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ కోసం భారీ ధరకు టికెట్స్
ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుతంగ రాణిస్తుంది. ఆడిన ఆరు మ్యాచ్ లు గెలిచి టాప్ గేర్ లో కొనసాగుతుంది. కెప్టెన్ రోహిత్, కింగ్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నారు. అటు కేఎల్ రాహుల్ చెలరేగడంతో భారత్ వరుస విజయాలు సాధిస్తుంది.
- Author : Praveen Aluthuru
Date : 31-10-2023 - 11:53 IST
Published By : Hashtagu Telugu Desk
world cup 2023: ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుతంగ రాణిస్తుంది. ఆడిన ఆరు మ్యాచ్ లు గెలిచి టాప్ గేర్ లో కొనసాగుతుంది. కెప్టెన్ రోహిత్, కింగ్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నారు. అటు కేఎల్ రాహుల్ చెలరేగడంతో భారత్ వరుస విజయాలు సాధిస్తుంది. ఇప్పటి వరకు వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమిని చవిచూడలేదు. ఈ ప్రదర్శనతో భారత్ 2023 ప్రపంచకప్‌లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. అదే సమయంలో టీమిండియా సెమీఫైనల్‌కు బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.
భారత్ తదుపరి మ్యాచ్ శ్రీలంకతో ఆడుతుంది.అయితే భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ కోసం అంకిత్ అగర్వాల్ అనే వ్యక్తి బ్లాక్ టిక్కెట్లు విక్రయిస్తూ పట్టుబడ్డాడు. అంకిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిజానికి టీమిండియా దక్షిణాఫ్రికా మ్యాచ్ టిక్కెట్ ధర రూ. 2500 మాత్రమే. కానీ అంకిత్ బ్లాక్ లో రూ.11000కి విక్రయిస్తున్నాడు. మరోవైపు కోల్‌కతా పోలీసులు ఆ వ్యక్తి నుంచి మొత్తం 20 టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ టికెట్ల ధర దాదాపు రూ.220000.
Also Read: world cup 2023: ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించిన పాక్