HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Talk About Pawan Kalyan Leadership

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నిజమైన పోరాట యోధుడు – చంద్రబాబు

Chandrababu praises Pawan Kalyan : పవన్ కల్యాణ్ నిజమైన పోరాట యోధుడని.. తనను అరెస్టు చేసినప్పుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్​ నుంచి వస్తుంటే జగన్ విమానాన్ని క్యాన్సిల్ చేశారని అయినాగానీ రోడ్ మార్గం ద్వారా వచ్చారని

  • Author : Sudheer Date : 18-09-2024 - 10:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cbn Pawan Kalyan Leadership
Cbn Pawan Kalyan Leadership

Chandrababu About Pawan Kalyan Leadership : సీఎం చంద్రబాబు (Chandrababu) మరోసారి జనసేన అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) ఫై ప్రశంసలు జల్లు కురిపించారు. పవన్ కల్యాణ్ నిజమైన పోరాట యోధుడని.. తనను అరెస్టు చేసినప్పుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్​ నుంచి వస్తుంటే జగన్ విమానాన్ని క్యాన్సిల్ చేశారని అయినాగానీ రోడ్ మార్గం ద్వారా వచ్చారని…నందిగామలో పవన్ కల్యాణ్ రాకుండా రోడ్డును మూసేస్తే మీద పడుకున్నారని కొనియాడారు. ఈరోజు చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి (BJP) ప్రభుత్వం రాకపోతే వెంటిలేటర్​పై ఉన్న రాష్ట్రాన్ని కాపాడటం కష్టమయ్యేదని అన్నారు. ఈరోజు కేంద్రంలో బిజెపి , రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టే ఈరోజు రాష్ట్ర ప్రజలు గుండెలపై చేయి వేసుకొని నిద్రపోతున్నారన్నారు. టీడీపీ జనసేన , బిజెపి మూడు పార్టీలు ఎన్నికల సమయంలో ఎటువంటి గ్యాప్ లేకుండా పని చేశాయన్నారు. పురందేశ్వరి పొత్తుకు అనేక విధాలుగా కృషి చేశారని వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అన్నారు. తనను అరెస్టు చేసినప్పుడు పవన్.. హైదరాబాద్​ నుంచి వస్తుంటే జగన్ విమానాన్ని క్యాన్సిల్ చేశారని, విమానం లేకపోయినా పవన్ బై రోడ్డు వచ్చారని గుర్తు చేశారు. నందిగామలో పవన్ కల్యాణ్ రాకుండా రోడ్డును మూసేస్తే మీద పడుకున్నారని కొనియాడారు. పవన్ కల్యాణ్ నిజమైన పోరాట యోధుడని అభినందించారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు ఒక ఆశయం కోసం వచ్చారని , ప్రజలు గెలవాలి రాష్ట్రం పునర్నిర్మాణం కావాలని పవన్ కల్యాణ్ కోరాడని గుర్తు చేశారు. వరద సహాయార్ధం పవన్‌ కల్యాణ్‌ రూ.6 కోట్లు విరాళం ఇచ్చారని సీఎం కొనియాడారు.

అంతకు ముందు పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు ఫై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు హయాంలో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని..కేవలం 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చామని , ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ హామీ ఇచ్చినట్లు పింఛన్లను పెంచి చూపించామని వెల్లడించారు. చంద్రబాబు దార్శనికుడు, అనునిత్యం ఆశ్యర్యపరుస్తూ, ఆయనకు ఉన్న జ్ఞానాన్ని, ఓపికని చూసి ఆశ్చర్యం కలుగుతుందని కొనియాడారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి వచ్చేవి కావు. జీతాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేది..కానీ ప్రస్తుతం ఒకటో తేదీనే అకౌంట్లలోకి జీతం పడుతుందని గుర్తు చేసారు. అలాగే నిర్జీవమవుతున్న పంచాయతీలకు సీఎం రూ.1,452 కోట్లు ఇచ్చి జీవం పోశారన్నారు. అన్న క్యాంటీన్ల వల్ల పేదలు, కార్మికులకు ఎంతో లాభం జరుగుతుందని , ఎంతో మంది కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లను ఎలా మూసివేయాలనిపించిందని గత ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని రద్దు చేయాలని చాలామంది సూచించారు, ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని రద్దు చేసి పేదల భూములను రక్షించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాజమండ్రి జైల్లో చంద్రబాబు ను కలిసినప్పుడు ఆయన గుండె ధైర్యాన్ని చూశా. బాబులో ఆత్మస్థైర్యం ఏనాడూ దెబ్బతినలేదు. పాలన ఎలా ఉండాలో బాబు పక్కనే ఉండి నేర్చుకోవాలనుకున్నా. జైల్లో ఉన్నప్పుడు నేను సినిమా షూటింగులకు కూడా వెళ్లలేదు. షూటింగ్‌కు రావాలని ప్రొడ్యూసర్లు అడిగినా నేను రానని చెప్పా నని పవన్ గుర్తు చేసారు. ఇలా ఒకరిపైఒకరు ప్రశంసలు , అభినందనలు తెలుపుకోవడం ఫై ఇరు పార్టీల శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Telangana Flood Relief Fund : వరద బాధితుల కోసం సీఎంఆర్ఎఫ్‌కు భారీ విరాళాలు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Chandrababu
  • AP Deputy CM Pawan
  • Pawan Kalyan Leadership

Related News

Cbn Ai

AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

చంద్రబాబు నాయుడు తన విజన్ 2047లో భాగంగా ఏఐ సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని సాయంత్రానికే అమరావతి చేరుకోనున్న ఆయన, ఈ సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాలను వెనువెంటనే పట్టాలెక్కించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు

  • 'Sanjeevani' Project : బిల్ గేట్స్ ప్రారంభించే 'సంజీవని' ప్రాజెక్టు గురించి తెలుసా?

    ‘Sanjeevani’ Project : బిల్ గేట్స్ ప్రారంభించే ‘సంజీవని’ ప్రాజెక్టు గురించి తెలుసా?

  • Ap Budget 2026–27

    నేడు ఏపీ బడ్జెట్..

Latest News

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd