Ramoji Rao Memorial Program : రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి – సీఎం చంద్రబాబు
రామోజీరావు ఆఖరి వరకు విలువల కోసమే పని చేశారన్న చంద్రబాబు ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందిస్తామని చెప్పారు
- Author : Sudheer
Date : 27-06-2024 - 8:46 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ (Ramoji Rao Memorial Program) గురువారం విజయవాడలోని కానూరులో అట్టహాసంగా జరిగింది. ఈ సంస్మరణ సభకు అతిరథ మహారథులు హాజరై రామోజీరావు కు నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమానికి రామోజీరావు కుటుంబ సభ్యులతో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, మనోహర్, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, పార్థసారథి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు (Chandrababu) మాట్లాడుతూ.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు అని, ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చి దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగిన మహోన్నత శిఖరమన్నారు. రామోజీరావు ఆఖరి వరకు విలువల కోసమే పని చేశారన్న చంద్రబాబు ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందిస్తామని చెప్పారు. అలాంటి అక్షరయోధుడికి భారతరత్న సాధించడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. మార్గదర్శిలో ప్రతీ పెట్టుదారుడు రామోజీరావు వెంటే నిలిచారంటే అదీ ఆయన విశ్వసనీయత అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
40 ఏళ్లుగా నెంబర్1 లో ఈనాడు ఉందంటే ఎంతటి కార్యదీక్ష ఉందో అందరూ అర్ధం చేసుకోవాలన్న ఆయన.. రాజధానికి రామోజీరావు సూచించిన పేరు ప్రపంచ మంతా మార్మోగింది.. తెలుగు భాష అంటే రామోజీరావుకు ఎనలేని అభిమానం, తెలుగు జాతి అంటే ఎనలేని ఆప్యాయత.. రామోజీరావు స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు, 10 కోట్ల ప్రజలది అన్నారు. ఇక, విశాఖలో రామోజీరావు మొదటి అడిషన్ పెట్టారు.. ఈనాడు ప్రజాగళంగా ప్రజా చైతన్యం కోసం పనిచేస్తున్నది.. పత్రికా రంగంలో ఉండి రామొజీరావు ప్రజా సమస్యల కోసం పని చేసారు.. సినిమా రంగంలో, జర్నలిజంలో ఎందరినో తయారు చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
ఏ ఐఏఎస్ ను బదిలీ చేయమని, ఏ పనీ తనకు చేసి పెట్టమని ఏరోజు అడగని వ్యక్తి రామోజీరావు.. పదవులు కోసం కాదం ప్రజా చైతన్యం కోసం పని చేసిన వ్యక్తి రామోజీరావు.. అప్పట్లో 9 నెలల్లో రామారావు అధికారంలోకి రావడంలో రామోజీరావు పాత్ర ఉంది.. రాజీ పడకుండా పోరాడి, సుప్రీంకోర్టు వరకూ వెళ్ళి తన పనులు నిజం అని నిరూపించుకున్న వ్యక్తి రామోజీరావు.. నలభై ఏళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన వ్యక్తి రామోజీరావు అని గుర్తుచేసుకున్నారు.
Read Also : Janasena : జనసేనకు ప్రతిపక్ష హోదా వస్తుందా..?