Chandrababu : చెత్తపై పన్ను వేసిన దుర్మార్గుడు జగన్ – చంద్రబాబు
ఐదేళ్ల వైసీపీ నరకపాలనకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. అధికారంలోకి రాగానే బీసీల రక్షణకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామన్న, అలాగే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని స్పష్టం చేశారు.
- By Sudheer Published Date - 08:37 PM, Thu - 11 April 24

చెత్తపై పన్ను వేసిన దుర్మార్గుడు సీఎం జగన్ (Jagan) అంటూ అంబాజీపేట (Ambajipeta)లో ఏర్పటు చేసిన ప్రజాగళం (Prajagalam) సభలో చంద్రబాబు (Chandrababu) జగన్ ఫై మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు..ఈరోజు అంబాజీపేటలో ఏర్పటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ…ఐదేళ్ల వైసీపీ నరకపాలనకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. అధికారంలోకి రాగానే బీసీల రక్షణకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామన్న, అలాగే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని స్పష్టం చేశారు. గోదావరి జిల్లాల ప్రజలు వన్సైడ్ తీర్పిచ్చారు. మరోసారి మోడీ, నేను, పవన్ జతకట్టాం. నిలబడే దమ్ము జగన్కు (Jagan) ఉందా? మీరు నిలబడనిస్తారా? అంటూ బాబు ప్రశ్నించారు. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ అని ఎద్దేవా చేశారు. మంచి నీళ్లు అడిగితే కోనసీమ వాసులు కొబ్బరి నీళ్లు ఇచ్చే మంచి సంస్కరం ఇక్కడ ఉందని కానీ కోనసీమ జిల్లాలో ప్రజల మధ్య విద్వేషం రెచ్చగొట్టేలా జగన్ కుట్రలు పన్నారని ధ్వజమెత్తారు.
We’re now on WhatsApp. Click to Join.
జగన్ ఒక్క డీఎస్సీ ఇవ్వలేదని , ఉద్యోగాలు ఊసేలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అన్ని రంగాలను కోలుకోలేని దెబ్బ తీశారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు ఇవ్వాల్సిన నిధులను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దళితులకు సంబంధించిన 27 సంక్షేమ పథకాలు జగన్ రద్దు చేశారని విరుచుకుపడ్డారు. దళితులకు విదేశీ విద్య రద్దు చేశారన్నారు. 6 వేల మంది దళితులపై కేసులు పెట్టారని వాపోయారు.
భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టి ఒక్కరే పొట్ట నింపుకుంటున్నారని, ఎక్కడ చూసినా ఇసుక మాఫియా చెలరేగిపోతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. పోలీసులకు బకాయిపడ్డ నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు ఆర్థిక ఇబ్బందులతో చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల కోసం డిక్లరేషన్ తీసుకువస్తామని, వరికి గిట్టుబాటు ధర కల్పిస్తామని , కొబ్బరి ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేస్తామని, సబ్ ప్లాన్ ద్వారా బీసీలను ఆర్థికంగా పైకి తీసుకొస్తామని, స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు తీసుకొస్తామని, ఆదరణ పథకం కింద రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తామని, చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతామని హామీ ఇచ్చారు.
Read Also : AP Politics: చంద్రబాబుపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే!