Janasena & TDP : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు ఫోన్.. నేతల అరెస్టులను ఖండించిన బాబు
వైజాగ్‌లో అరెస్ట్ చేసిన జనసేన నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు
- Author : Prasad
Date : 16-10-2022 - 9:39 IST
Published By : Hashtagu Telugu Desk
వైజాగ్‌లో అరెస్ట్ చేసిన జనసేన నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు విశాఖపట్నంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ఖండించారు. జనసేన పార్టీ ‘జనవాణి’ని ఆపేందుకు వైఎస్సార్‌సీపీ కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయ పార్టీ అధినేత ఏం చేయాలో పోలీసులు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. విశాఖ దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ పై పోలీసుల ఆంక్షలు, ప్రభుత్వం చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు. విశాఖ పర్యటనపై తనకు నోటీసులు ఇవ్వడం, నేతలను అరెస్టు చేసిన అంశంపై పవన్..టీడీపీ అధినేతకు వివరించారు. పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ లో సోదాలు, బెదిరింపులు నియంతృత్వ పాలనకు నిదర్శనమని, విశాఖ ఘటన పేరుతో అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడంపై మండిపడ్డారు. ర్యాలీకి అనుమతి అడిగిన నేతలపై హత్యాయత్నం కేసులు పెట్టామని నాయుడు తెలిపారు. అరెస్ట్ చేసిన జనసేన నాయకులు, కార్యకర్తలను చంద్రబాబు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.