Chandrababu : సీఎంకు ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియదు..బాబు ఏమైనా సైటైరా..!!
- By Sudheer Published Date - 09:11 PM, Sat - 27 January 24

ఏపీ (AP)లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ (YCP) తో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి. నేడు శనివారం వైసీపీ అధినేత జగన్ (Jagan) భీమిలీ లో ఎన్నికల శంఖారావం పూరిస్తే..టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటీకే రా..కదలిరా పేరుతో భారీ సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. నేడు పీలేరు , ఉరవకొండ సభల్లో పాల్గొని , జగన్ ఫై నిప్పులు చెరిగారు.
ఉరవకొండ సభలో జగన్ ఫై తనదైన శైలి లో పంచులు , విమర్శలు చేస్తూ ప్రజలకు ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. ముఖ్యంగా జగన్ కు ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియదు అంటూ సెటైర్ వేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు.’ఓటమి ఖాయమని తెలిసే జగన్ మాటల్లో తేడా వచ్చింది. హ్యాపీగా దిగిపోతా అని చెపుతున్నాడు. రాష్ట్రానికి పట్టిన శని పోయేందుకు ఇంకా 74 రోజులే ఉంది. వైసీపీ పాలనలో నష్టపోని వ్యవస్థ ఒక్కటీ లేదు. ఈ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది’ అని విమర్శించారు.
We’re now on WhatsApp. Click to Join.
వైసీపీ నేతల లెక్కలు రాస్తున్నానని, చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ సినిమా అయిపోయింది. సీట్లు ఇచ్చినా ఆ పార్టీ నేతలు పారిపోతున్నారు. జగన్, ఆయన చెల్లి కొట్టుకుంటే నేను కారణమా..? రాష్ట్రంలో నాకు అందరూ స్టార్ క్యాంపెయినర్లే. జగన్ ల నేను మోసం చేయను. ఆయన వల్ల అందరూ నష్టపోయారు’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. జగన్ ఎన్నికల్లో గెలవడానికి ఇప్పటికే 65 సీట్లు మార్చారని, అందులో 29 మందికి సీట్లు ఎగ్గొట్టారని, మిగతా వారిని అక్కడికి ఇక్కడికి మార్చారని.. ఈ ఊర్లో చెత్త వేరే ఊర్లో వేస్తే బంగారం అవుతుందా.. చెత్త చెత్తే కదా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలనకు డెడ్ లైన్ మొదలైందని..ప్రజాక్షేత్రంలో జగన్ కు శిక్షపడే సమయం దగ్గర పడిందని మండిపడ్డారు.
Read Also : Trivikram New Look : గురూజీ కొత్త లుక్.. చాన్నాళ్ల తర్వాత గడ్డెం లేకుండా..!