HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Naidus Good News For Black Burley Tobacco Farmers

Black Burley Tobacco : బ్లాక్ బర్లీ పొగాకు రైతులకు చంద్రబాబు గుడ్ న్యూస్

Black Burley Tobacco : కామన్ వెరైటీకి క్వింటాలుకు రూ. 12,000 మరియు లో గ్రేడ్ కు రూ. 6,000 ధరగా నిర్ణయించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మార్పులు వచ్చినా నిర్ణయించిన ధరలను తప్పకుండా అమలు చేయాలని కంపెనీలకు సూచించారు.

  • Author : Sudheer Date : 26-05-2025 - 1:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Black Burley Tobacco
Black Burley Tobacco

బ్లాక్ బర్లీ పొగాకు (Black Burley Tobacco) రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు, రైతులు మరియు బయ్యర్లతో జరిగిన ముఖాముఖి చర్చల అనంతరం, కొనుగోలు ప్రక్రియపై కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా బ్లాక్ బర్లీ పొగాకును రెండు గ్రేడ్లుగా విభజించి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. కామన్ వెరైటీకి క్వింటాలుకు రూ. 12,000 మరియు లో గ్రేడ్ కు రూ. 6,000 ధరగా నిర్ణయించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మార్పులు వచ్చినా నిర్ణయించిన ధరలను తప్పకుండా అమలు చేయాలని కంపెనీలకు సూచించారు.

Southwest Monsoon : తెలంగాణ, ఏపీలను తాకిన ‘నైరుతి’.. రాబోయే 3 రోజులు వానలు

పొగాకు కొనుగోలులో ప్రాసెసింగ్‌ ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు పండించిన చివరి ఆకును కూడా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. దీనికోసం ఆరు సబ్‌కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కంపెనీలు రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని, ఫోన్‌ చేసినప్పుడు స్పందించకపోతే ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులకు ధైర్యం కల్పించేందుకు, వారిని సంక్షోభం నుంచి రక్షించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని అచ్చెం నాయుడు తెలిపారు. ధరల స్థిరీకరణ నిధిగా రూ.130 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఈ నిధిలోంచి ఇటీవల టమోటా రైతులను కూడా ఆదుకున్నామని గుర్తుచేశారు. అదే విధంగా బ్లాక్ బర్లీ పొగాకు రైతులకూ సహాయం అందించాలని కంపెనీలు బాధ్యతతో ముందుకు రావాలని, కొనుగోలు ప్రక్రియను వేగంగా ప్రారంభించాలని మంత్రి కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap govt
  • Black Burley Tobacco
  • Black Burley Tobacco Farmers
  • Black Burley Tobacco Price
  • good news

Related News

Iftar Ramadan

Ramadan 2026 : ఏపీ ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

రాష్ట్ర స్థాయి ప్రధాన ఇఫ్తార్ వేడుక ఈ నెల 16వ తేదీన విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరై, ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు

  • CM Chandrababu Naidu's sweet message to Dwakra women

    Good News : డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు తీపికబురు.. త్వరలో మరో పథకం అమలు

  • Liquor Price Down

    Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

Latest News

  • Grijp 20 Gratis Kansen om de Magie van spin maya te Ontketenen

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd