Chandrababu : రేపు ఢిల్లీకి చంద్రబాబు..
లూథ్రా (Sidharth Luthra) కుమారుడి పెళ్లి రిసెప్షన్‌కు చంద్రబాబు (Chandrababu) హాజరవుతారు
- Author : Sudheer
Date : 26-11-2023 - 4:42 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు దంపతులు రేపు (నవంబర్ 27 ) ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఢిల్లీలో జరగనున్న సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Sidharth Luthra) కుమారుడి పెళ్లి రిసెప్షన్‌కు చంద్రబాబు (Chandrababu) హాజరవుతారు. చంద్రబాబు వెంట సతీమణి భువనేశ్వరి కూడా వెళ్లనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు రేపు మధ్యాహ్నం హైదరాబాద్ (Hyderabad) నుంచి ఢిల్లీకి(Delhi) వెళ్లనున్నారు. రాత్రి జరిగే రిసెప్షన్‌కు హాజరవుతారు. తర్వాతి రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించిన తర్వాత తొలి పర్యటన ఇదే.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై ఈ నెల 28న (మంగళవారం) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీశ్‌చంద్ర మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ఇటీవల రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయగా, ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో సీఐడీ సవాల్ చేసింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరులో హైకోర్టు తన పరిధి దాటిందని పిటిషన్‌లో సీఐడీ పేర్కొంది. మరి దీనిపై సుప్రీం ఏ తీర్పు ఇస్తుందో చూడాలి.
Read Also :