TDP : మూడు నెలల్లో అమరావతే రాజధాని.. ఇది తథ్యం : ఆచంట సభలో చంద్రబాబు
- Author : Prasad
Date : 07-01-2024 - 10:12 IST
Published By : Hashtagu Telugu Desk
మరో మూడు నెలల్లో అమరావతే రాజధాని అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఆచంట నియోజకవర్గంలో రా కదలిరా రా సభలో ఆయన ప్రసంగించారు. బాబాయి హత్యలో చెల్లిపై కేసు పెట్టడమే జగన్ విశ్వసనీయత అని.. మద్య నిషేధం అని చెప్పి.. మద్యంపై అప్పు తేవడమేనా విశ్వసనీయత అని ఆయన ప్రశ్నించారు. వైసీపీలో బూతు రత్నలకు, బూతు సామ్రాట్ లకు ఎమ్మెల్యే టిక్కెట్లు, మంత్రి పదవులు ఇస్తున్నారని తెలిపారు. 2014లో 15కి 15 అసెంబ్లీలు, 3కి 3పార్లమెంటులు గెలిపించారని.. రానున్న ఎన్నికల్లోనూ టీడీపీ, జనసేనల జైత్రయాత్రను ఇక్కడినుండే ప్రారంభించబోతున్నామని తెలిపారు. టీడీపీ, జనసేన అంటే అత్యంత అభిమానం వారు పశ్చిమగోదావరిజిల్లా ప్రజలు. అని.. మొట్టమొదటిసారిగా ఒకేఒకసారి 2019లో తప్పటడుగు వేశారని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్ర ప్రజలను మోసం చేసిన పార్టీని రానున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి భూస్థాపితం చేయడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా? అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. టీడీపీ బహిరంగ సభకు స్థలం ఇవ్వకుండా అడ్డుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోవాలంటూ హెచ్చరించారు. తాము తలచుకుంటే అసలు వ్యాపారాలు చేసేవాడా? అని హెచ్చరించారు. పశ్చిమగోదావరిజిల్లా ఆక్వారంగానికి నెలవని..పెద్దఎత్తున ఆక్వా పంట ఉందన్నారు. జగన్ పాలనలో ఆక్వారంగం ధ్వంసమైందని చంద్రబాబు ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పశ్చిమగోదావరిలో ఆక్వారంగానికి పెద్దపీట వేశానని.. రాయలసీమలో హార్టీకల్చర్ ను ప్రోత్సహించి లాభాలు వచ్చేలా చేశానన్నారు. ఆక్వారంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదేనని తెలిపారు. ఈ నాలుగున్నరేళ్లలో రైతులు పడరానిపాట్లు పడ్డారని.. కనీసం పంట అమ్ముకునేందుకు గోనె సంచులు కూడా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమన్నారు. నీళ్లు ఉంటే క్రాప్ హాలిడే ప్రకటించిన పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. దేశంలో అత్యధిక అప్పులు ఉన్న రైతుల్లో ఏపీ రైతులు ముందు వరుసలో ఉన్నారని తెలిపారు. కౌలురైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో 2వ స్థానంలో ఉందని.. రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో 3వ స్థానంలో ఉందన్నారు.తాము అధికారంలోకి వచ్చాక రైతు రాజ్యాన్ని తెస్తామని…రైతులకు అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
పోలవరం రాష్ట్ర ప్రజల చిరకాల కోరికని..తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని పనులు పరుగులు పెట్టించానని గుర్తు చేశారు.అధికారంలో ఉన్న్పపుడు 72శాతం పనులు నేను పూర్తిచేశానని.. అసమర్థుడు వస్తే చేతకాని వాడు అని అంటాం.. కానీ దుర్మార్గుడు సీఎం అవ్వడం వల్ల పోలవరానికి గ్రహణం పట్టిందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే కాంట్రాక్టర్‌ను, అధికారులను మార్చాడని తెలిపారు. డయాఫ్రం వాల్ రెండు సీజన్లో వరదలో దెబ్బతింటే దాన్ని పట్టించుకునేవారు లేరని.. నేటికీ అతీగతి లేదన్నారు.