CBN : ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
CBN : మొదటి రెండు ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు
- By Sudheer Published Date - 11:53 AM, Sat - 1 March 25

ఆశా వర్కర్ల (ASHA Workers) కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu ) గుడ్ న్యూస్ అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఆశా వర్కర్లకు మరిన్ని ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా మొదటి రెండు ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అలాగే ఆశా వర్కర్ల గరిష్ట వయోపరిమితిని అంగన్‌వాడీ కార్యకర్తలతో సమానంగా 62 సంవత్సరాలకు పెంచే యోచనలో ఉన్నారు. ఇది వారి భద్రతకు ఉద్యోగ స్థిరత్వానికి మరింత తోడ్పడే నిర్ణయంగా భావిస్తున్నారు.
Delhi Rains : ఢిల్లీలో వర్షాలు.. ఉపశమనం పొందుతున్న దేశరాజధాని ప్రజలు
ప్రస్తుతం ఆశా వర్కర్లు నెలకు రూ.10,000 వేతనం పొందుతున్నారు. అయితే వారి సేవ ముగిసిన తర్వాత గ్రాట్యుటీ కింద సుమారు రూ.1.5 లక్షలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇది ఆశా వర్కర్లకు కొంత ఆర్థిక భద్రతను అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42,752 మంది ఆశా వర్కర్లు ఉన్నారు. వీరిలో 37,017 మంది గ్రామీణ ప్రాంతాల్లో, 5,735 మంది పట్టణ ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వీరంతా లబ్ధి పొందనున్నారు.
Posani Krishna Murali: అంతా సజ్జల డైరెక్షన్‌లోనే.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు
ఈ నిర్ణయాలు ఆశా వర్కర్ల ఉద్యోగ భద్రతను పెంచడమే కాకుండా, వారి సేవలకు గౌరవాన్ని కలిగించేలా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజారోగ్య సంరక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆశా వర్కర్లు, ఈ కొత్త విధానాల ద్వారా మరింత ఉత్సాహంగా పని చేసే అవకాశం ఉంది. త్వరలోనే ప్రభుత్వం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది.