HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Fire On Ycp

AP : పెన్షన్లపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం

పెన్షన్ల పంపిణీకి దాదాపు పది రోజుల సమయం పడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ.. ఈ అంశాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లింది

  • Author : Sudheer Date : 01-04-2024 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu (1)
Chandrababu (1)

ఏపీలో పింఛన్‌ పంపిణీపై రాజకీయ రంగు అల్లుకుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్‌లతో పింఛన్ పంపిణీ చేయించవద్దని, ప్రభుత్వ అధికారులే ఈ ప్రక్రియ చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వైసీపీ మరోవిధంగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. పింఛన్‌ పంపిణీకి చంద్రబాబు అడ్డు తగిలాడని, ఈసీ టీడీపీనేతలే పిర్యాదు చేసారని..అందుకే పింఛన్‌ ఇవ్వలేకపోతున్నామని..ఇప్పుడే ఇలా ఉంటె ప్రభుత్వంలోకి టీడీపీ వస్తే ఇంకెలా ఉంటుందో చెప్పండి అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

అధికార పార్టీ నేతలు మాటలు నిజమే కావొచ్చు అని పింఛన్‌ దారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో జాప్యంపై టీడీపీ (TDP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పెన్షన్ల పంపిణీకి దాదాపు పది రోజుల సమయం పడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ.. ఈ అంశాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లింది. సోమవారం సీఎస్ జవహర్ రెడ్డితో టీడీపీ నేతల బృందం భేటీ అయ్యింది. పెన్షన్లు పంపిణీ విషయంలో వైసీపీ కావాలనే జాప్యం చేసేలా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపించింది. ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేలా ఆదేశాలివ్వాలని సీఎస్ జవహర్ రెడ్డిని (CS Jawaha Reddy) టీడీపీ నేతల బృందం కోరింది.

మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వైసీపీ చేస్తున్న ప్రచారం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. పెన్షన్లపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘1వ తేదీన పెన్షన్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ఆ నెపాన్ని టీడీపీ, ఎన్నికల సంఘంపై నెడుతున్నారు. పెన్షన్లు పంపిణీ చేయొద్దని టీడీపీ ఎవరినీ కోరలేదు. వైసీపీ కుట్రలను ఇంటింటికి వెళ్లి తెలియజేయాలి. ఖజానా ఖాళీ చేసి పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు’ అని విమర్శించారు.

Read Also : Katchatheevu Island:కచ్చతీవు ద్వీపాన్ని ఆయన వెనక్కి తీసుకుంటారా?”: ప్రధానికి కాంగ్రెస్ ఎంపీ సవాల్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • pensions
  • ycp

Related News

CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పని తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఉద్యోగులు వినూత్నంగా ఆలోచనలు చేసేలా ప్రోత్

    Latest News

    • Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

    • CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

    • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

    • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

    • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd