CBN-Prajagalam : జే టాక్స్, జే బ్రాండ్ పేరిట ప్రజల జేబులు కొల్లగొట్టిన ఘనత జగన్ ది – చంద్రబాబు
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున బనగానపల్లెకు రావడం సంతోషంగా ఉందని, జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని స్ధానం టీడీపీకే దక్కిందన్నారు
- Author : Sudheer
Date : 29-03-2024 - 5:21 IST
Published By : Hashtagu Telugu Desk
జే టాక్స్, జే బ్రాండ్ పేరిట ప్రజల జేబులు కొల్లగొట్టిన ఘనత జగన్ (Jagan) కే దక్కుతుందని చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కేంద్రంగా పెట్రోల్ బంకు సర్కిల్ ప్రజా గళం భారీ బహిరంగసభ లో జగన్ పై నిప్పులు చేరిగారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున బనగానపల్లెకు రావడం సంతోషంగా ఉందని, జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని స్ధానం టీడీపీకే దక్కిందన్నారు. కృష్ణా జలాలు రాయలసీమకు అందించిన మహనీయుడు ఎన్టీ రామారావు (NT Ramarao) అని కొనియాడారు. మూడు రాజధానులు చేశానని జగన్ (CM Jagan) నిన్న నంద్యాలలో చెప్పారు.. కర్నూలులో జుడిషియల్ క్యాపిటల్ ఎక్కడుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటాడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ అన్నారు. ప్రజలకు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసిన మోసగాడు జగన్ అని,ఒక్క ఛాన్స్ తండ్రి లేని బిడ్డను అని చిన్నాన్నను గొడ్డలి పోటుతో చంపేశారని తీవ్రంగా విమర్శించారు.అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత ఈ దుర్మార్గుడిదేనని, ఫ్యాన్ పీకేసి చెత్తకుండీలో పారేస్తేనే అందరికీ భవిష్యత్తు ఉంటుందని అన్నారు. బనగానపల్లె ప్రజలను చూసి ఎండలే భయపడుతున్నాయని, భావి తరాల భవిష్యత్తుకు నాంది పలుకుతానని సభా వేదికగా చంద్రబాబు అన్నారు. కార్మికులకు పనులు దొరకడం లేదు… కార్పొరేషన్‌ల ద్వారా జగన్ ఏ ఒక్కరికీ పైసా ఇవ్వలేదని విమర్శించారు. వైసీపీని చిత్తు చిత్తు చేయాలని శంఖారావం పూరించానన్నారు. కర్నూలు జిల్లాలో తాగడానికి కూడా నీళ్లు దొరకడం లేదని, జగన్ బస్సు యాత్ర తుస్ మందని, జగన్‌ను ఇంటికి పంపడానికి జనం సిద్దంగా ఉన్నారన్నారు. జగన్ నేడు జనాల్లోకి వస్తుంటే జనాలు పారిపోతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి గా ఏనాడైనా జనాల్లోకి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకోలేదని విమర్శించారు.
Read Also : Bihar : బీహార్‌లో సీట్ల ఒప్పందం.. ఆర్జేడీకు 26, కాంగ్రెస్‌కు 9