HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Congratulated The Collectors Of Palnadu And Krishna Districts

పల్నాడు, కృష్ణా జిల్లా.. కలెక్టర్లకు చంద్రబాబు అభినందన

  • Author : Vamsi Chowdary Korata Date : 02-01-2026 - 11:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap District Collector's
Ap District Collector's

AP CM Chandrababu Naidu : నూతన సంవత్సర శుభాకాంక్షలను వినూత్నంగా తెలిపిన పల్నాడు, కృష్ణా జిల్లా కలెక్టర్లను సీఎం చంద్రబాబు అభినందించారు. పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లాకు అధికారులు పుస్తకాలు, విద్యా సామగ్రిని బహుమతిగా అందించగా, కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ సూచన మేరకు బాలికల వసతిగృహాలకు శానిటరీ నాప్కిన్ ఇన్సినరేటర్లు, చిన్న బల్లలు సమకూరాయి. ఈ కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగంగా ఉంటాయని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.

  • ఇద్దరు కలెక్టర్లకు చంద్రబాబు అభినందన
  • న్యూ ఇయర్ రోజు వినూత్న ఆలోచన చేశారు
  • విద్యార్థులకు ఉపయోగపడేలా అద్భుతో ఆలోచన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు జిల్లా కలెక్టర్లను అభినందించారు. న్యూ ఇయర్ రోజు పల్నాడు జిల్లా కలెక్టరేట్, కృష్ణా జిల్లా కలెక్టర్లు చేసిన వినూత్న ఆలోచన బావుందని ప్రశంసించారు. ‘నూతన సంవత్సర శుభాకాంక్షలను విద్యార్థులకు ఉపయోగపడేలా మలిచిన కృష్ణ జిల్లా, పల్నాడు జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అభినందించారు. పలు జిల్లాలలో జిల్లా కలెక్టర్లు ఇలా వినూత్న ఆలోచనలతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు’ అని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేశారు.

పల్నాడు జిల్లా కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది కలెక్టర్ కృతికా శుక్లాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌కు న్యూ ఇయర్ విషెస్ తెలిపేందుకు ఒక వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. కలెక్టర్‌ను క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలిసి.. నోటు పుస్తకాలు, విద్యా సామగ్రి, పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు, డిక్షనరీలు, పెద్ద బాలశిక్ష వంటి పుస్తకాలను అందజేశారు. బొకేలు, శాలువాల బదులు ఇలా.. మొత్తం 1300 నోట్ బుక్స్, 275 ఇతర పుస్తకాలను అందించారు. ఈ వినూత్న ఆలోచనతో పుస్తకాలు తీసుకొచ్చి ఇవ్వడంపై కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పుస్తకాలను వసతిగృహాలలో చదువుకుంటున్న విద్యార్థులకు, అలాగే గ్రంథాలయానికి కానుకగా అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కూడా వినూత్నంగా ఆలోచించారు. న్యూ ఇయర్ రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలు, స్వీట్స్, శాలువాల వంటి అనవసర ఖర్చులు తగ్గించాలని కలెక్టర్ సూచించారు.. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అనవసర ఖర్చులు చేయకుండా, ఇతరులకు ఉపయోగపడే పనులు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ ఇటీవల సూచించారు. ఈ సూచనను స్ఫూర్తిగా తీసుకుని జిల్లా అధికారులు, సిబ్బంది తమ వంతుగా ఈ సహాయాన్ని అందించారు. గుర్తించిన అవసరాలకు అనుగుణంగా ఈ వస్తువులను సమకూర్చారు.

ఈ క్రమంలో కృష్ణా జిల్లాలోని బాలికల సంక్షేమ వసతిగృహాలకు శానిటరీ నాప్కిన్ ఇన్సినరేటర్లు, చిన్న బల్లలు సమకూరాయి. జిల్లాలో వివిధ శాఖ అధికారులు ఈ సాయాన్ని అందించారు. కలెక్టర్ డీకే బాలాజీకి 48 ఇన్సినరేటర్లు, 972 చిన్న బల్లలను హాస్టళ్ల కోసం అందజేశారు. ఈ ఇన్సినరేటర్లు, అంటే వాడిన శానిటరీ నాప్కిన్లను సురక్షితంగా కాల్చివేసే యంత్రాలు, బాలికల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఇన్సినరేటర్ విలువ సుమారు రూ.12,500. వీటితో పాటు విద్యార్థులు కూర్చోవడానికి వీలుగా చిన్న బల్లలను కూడా అందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సిబ్బందిని కలెక్టర్ డీకే బాలాజీ అభినందించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh CM
  • AP CM Chandrababu Naidu
  • Krishna District Collector
  • Palnadu District

Related News

Ap Transport Department

ఏపీలో వాహనదారులకు గుడ్ న్యూస్ 24 గంటల్లోపే వాహనాల రిజిస్ట్రేషన్‌

ఏపీలో 24 గంటల్లోపే వాహనాల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణాశాఖ 24 గంటల్లోగా రిజిస్ట్రేషన్‌కు సంబంధించి నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఆటోమేటిక్‌గా 24 గంటల తర్వాత ఆమోదం పొందినట్లే లెక్క. ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త విధానానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనాల రిజిస

  • Varma

    Pithapuram వర్మపై టీడీపీ వేటు

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

  • Ex Union Minister Maneka Gandhi Letter to Chandrababu Naidu

    చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ.. గంగమ్మ జాతరలో జంతు బలులు ఆపండి

Latest News

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

  • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd