Chandrababu : ఐదేళ్లలో వైసీపీ నేతలు తిన్నది కక్కిస్తా : టీడీపీ అధినేత చంద్రబాబు
ఉపాధి హామీ పథకం వైసీపీ నేతలు- కార్యకర్తలకు మేతగా మారిందని, పనులు చేయకుండా బిల్లులు మార్చుకున్నారని టీడీపీ
- Author : Prasad
Date : 29-12-2023 - 8:21 IST
Published By : Hashtagu Telugu Desk
ఉపాధి హామీ పథకం వైసీపీ నేతలు- కార్యకర్తలకు మేతగా మారిందని, పనులు చేయకుండా బిల్లులు మార్చుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ నేతలు తిన్నదంతా కక్కించి అరాచకాన్ని అణచివేస్తానని తెలిపారు. కుప్పం నియోజవర్గంలో చంద్రబాబు పర్యటించారు. చంద్రబాబు రాక సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. హంద్రీనీవాను కాలువను శ్రీశైలం నుండి రామకుప్పం దాకా తెస్తే.. ఐదేళ్లుగా దాన్ని జగన్ పూర్తి చేయలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తి చేసి నీళ్లందిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీయే లక్ష్యంగా పని చేయాలన్నారు. పేదరిక నిర్మూలనే తన లక్ష్యమని.. కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు గుడుపల్లిలో ఆయన పర్యటించారు. తాను ఎప్పుడు వచ్చినా గుడిపల్లి వాసులు అఖండ స్వాగతం పలుకుతారని.. ఆత్మీయుడిగా, కుటుంబ సభ్యుడిగా చూస్తూ ఆదరిస్తునారని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
కుప్పం ప్రజలు నన్ను 35 ఏళ్లుగా దీవిస్తున్నారని.. మళ్లీ నీవెంటే ఉంటాం అంటూ ఘనస్వాగతం పలుకుతున్నారని చంద్రబాబు తెలిపారు. తానేప్పుడూ కుప్పం ప్రజల మంచే కోరుకుంటానని.. తనకు కుప్పం.. తన సొంతం గ్రామం, కుటుంబం లాంటిందని ఆయన తెలిపారు. అందులోనూ గుడుపల్లి గుండెకాయలాంటిదని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గుడుపల్లి ప్రజలు 95 శాతం ఓట్లు టీడీపీకే వేస్తారని చంద్రబాబు తెలిపారు. అందుకే ఏ మాత్రం అనుమానం లేకుండా వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలువబోతున్నామని చంద్రబాబు తెలిపారు.వైసీపీ సినిమా అయిపోయిందని..వారికి ఇక వంద రోజులే మిగిలిందన్నారు. వైసీపీ నేతలు వంద కంటే ఎక్కువ తప్పులు చేశారని.. మిడిసి పడొద్దని చంద్రబాబు హెచ్చరించారు. కుప్పంలో మళ్లీ ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తానని తెలిపారు .
Also Read: Trump Blocked : ట్రంప్‌పై ‘మెయిన్’ బ్యాన్.. అధ్యక్ష ఎన్నికల బాటలో రెడ్ సిగ్నల్