Chandrababu at GFST Conference : GFST సదస్సులో సీఎం చంద్రబాబు
Chandrababu at GFST Conference : ఈ సదస్సులో సుస్థిర అభివృద్ధి కోసం ఆవిష్కరణలను ప్రదర్శిస్తూ, భవిష్యత్తుకు మార్గదర్శకమైన అంశాలను చర్చించారు. ప్రముఖ పరిశ్రమలు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు
- By Sudheer Published Date - 12:22 PM, Fri - 6 December 24

విశాఖపట్నం(Visakhapatnam )లో నోవోటెల్ హోటల్‌లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ (GFST) సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) హాజరయ్యారు. ఈ సదస్సులో సుస్థిర అభివృద్ధి కోసం ఆవిష్కరణలను ప్రదర్శిస్తూ, భవిష్యత్తుకు మార్గదర్శకమైన అంశాలను చర్చించారు. ప్రముఖ పరిశ్రమలు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు.
సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో సీఎం చంద్రబాబు సందర్శించారు. స్టాళ్లలో ప్రదర్శిస్తున్న నూతన ఆవిష్కరణలపై ఆయన ఆసక్తి చూపించి, వాటి పనితీరు, వినియోగాలు గురించి అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. ప్రదర్శనలో వినూత్న టెక్నాలజీలు, పర్యావరణం సుస్థిరతకు తోడ్పడే పరికరాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
కాసేపట్లో సీఎం చంద్రబాబు సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా సుస్థిర అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాజెక్టులు, అవి ఎలా ప్రజలకు ఉపయోగపడతాయన్న అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఆయన ప్రసంగం నుండి సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. సదస్సుకు హాజరవడానికి ముందు సీఎం చంద్రబాబు విశాఖ టీడీపీ కార్యాలయాన్ని సందర్శించారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా అక్కడ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దళితుల సంక్షేమం, సమాజ సమానత్వం కోసం అంబేడ్కర్ చేసిన కృషిని ఆయన స్మరించుకున్నారు. GFST సదస్సు, సుస్థిర అభివృద్ధిపై చర్చలకు వేదికగా నిలుస్తోంది. విశాఖలో జరుగుతున్న ఈ కార్యక్రమం వల్ల ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది.
విశాఖలో నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో, నూతన ఆవిష్కరణలు పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు #ChandrababuNaidu #AndhraPradesh #Visakhapatnam #HashtagU pic.twitter.com/woNCQ4Qfl9
— Hashtag U (@HashtaguIn) December 6, 2024
Read Also : Tirupati-Singapore Flights : తిరుపతి-సింగపూర్ విమాన సర్వీసులకు ప్రారంభం