CBN & Pawan Campaign : ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం
ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇరు పార్టీల అధినేతలు ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 10న తణుకు, నిడదవోలు, 11న పి.గన్నవరం, అమలాపురంలో వీరిద్దరూ ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం
- By Sudheer Published Date - 10:04 PM, Sun - 7 April 24

ఏపీ(AP Elections 2024)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో కూటమి అధినేతలు తమ దూకుడు ను పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటీకే టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రజాగళం పేరుతో ప్రజల్లో తిరుగుతుండగా…ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారాహి విజయభేరి యాత్ర పేరుతో ప్రజల్లో ఉన్నారు. ఇలా ఇరు అధినేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరికీ వారు ప్రజల వద్దకు వెళ్లగా..ఇక ఇప్పుడు ఇద్దరు కలిసి ఉమ్మడి ప్రచారం చేసేందుకు సిద్ధం అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇరు పార్టీల అధినేతలు ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 10న తణుకు, నిడదవోలు, 11న పి.గన్నవరం, అమలాపురంలో వీరిద్దరూ ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబదించిన ఏర్పాట్లు ఇరు పార్టీల శ్రేణులు సిద్ధం చేస్తున్నారు. మాములుగా ఒకరు రోడ్డు మీదకు వస్తేనే పార్టీ శ్రేణులను కంట్రోల్ చేయడం కష్టం..అలాంటిది ఇరు అధినేతలు కలిసి వస్తే ఇంకేమన్నా ఉందా..? అని అంత మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈరోజు చంద్రబాబు కృష్ణా జిల్లా పామర్రులో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొనగా..పవన్ కళ్యాణ్ అనకాపల్లి లో ప్రచారం చేసారు.
Read Also : Manchu Vishnu : జాక్ పాట్ కొట్టిన మంచు విష్ణు.. అయిదేళ్ల వరకు ‘మా’ అధ్యక్షుడిగా ఏకగ్రీవం..