Manchu Vishnu : జాక్ పాట్ కొట్టిన మంచు విష్ణు.. అయిదేళ్ల వరకు ‘మా’ అధ్యక్షుడిగా ఏకగ్రీవం..
మళ్ళీ 'మా' ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారు అని పలువురు ప్రశ్నించడం మొదలుపెట్టారు.
- Author : News Desk
Date : 07-04-2024 - 9:48 IST
Published By : Hashtagu Telugu Desk
Manchu Vishnu : టాలీవుడ్ లో నటీనటులకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఉన్న సంగతి తెలిసిందే. ఈ యూనియన్ కి ప్రతి రెండేళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. రెండేళ్ల క్రితం జరిగిన మా ఎన్నికలు సంచలనం సృష్టించాయి. ఆ ఎన్నికల్లో మంచు విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజ్ అంటూ చాలా హోరాహోరీగా సాగింది. ఉన్న 800 ఓట్ల కోసం ప్రచారాలు, హామీలు, ప్రెస్ మీట్స్, ఒకరిపై ఒకరు కామెంట్స్.. ఇలా రచ్చ రచ్చగా జనరల్ ఎలక్షన్స్ తలపించాయి.
ఆ ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపొందాడు. మంచు విష్ణు ప్రసిడెంట్ గా ‘మా’ కమిటీ ఏర్పాటైంది. అయితే ఇది జరిగి రెండేళ్లు దాటి కూడా చాలా కాలం అవుతుంది. దీంతో మళ్ళీ మా ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారు అని పలువురు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఎన్నికల్లో ముఖ్యంగా ఇచ్చిన ‘మా’ సొంత భవనం అనే హామీ ఇంకా నెరవేరకపోవడంతో మంచు విష్ణుని పలువురు ప్రశ్నిస్తున్నారు.
దీంతో నేడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లైఫ్ టైం మెంబర్స్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో మరోసారి ఎన్నికలు లేకుండా మంచువిష్ణుని ఏకగ్రీవంగా ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 26 మంది కమిటీ సభ్యులు ఈ నిరయం తీసుకున్నారు. ‘మా’ అసోసిషన్ కి నూతన భవనం నిర్మించే వరకు మంచు విష్ణునే అధ్యక్షడు అంటూ తీర్మానం చేశారు. దీంతో ఇప్పట్లో మళ్ళీ మా ఎన్నికలు జరగవని తెలుస్తుంది. మరి దీనిపై ఇండస్ట్రీ పెద్దలు కానీ, వేరే నటీనటులు కానీ స్పందిస్తారేమో చూడాలి. ‘మా’ భవనం ఎప్పటికి అవుతుందో చూడాలి.

Maa
Also Read : Pushpa2: పుష్ప 2 టీజర్ రిలీజ్ డేట్ టైం పిక్స్.. పోస్ట్ వైరల్?