CBN-NBK : ఎన్టీఆర్ శతజయంతిలో రాజకీయ సందడి
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఏడాది మొత్తం జరుపుతున్నారు.కానీ, విజయవాడ.కోరంకి వద్ద వేదికగా జరిగే వేడుకలు (CBN-NBK) వినూత్నం.
- Author : CS Rao
Date : 28-04-2023 - 2:36 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఏడాది మొత్తం జరుపుతున్నారు. కానీ, విజయవాడలోని కోరంకి వద్ద అనుమోలు ఫంక్షన్ హాల్ వేదికగా జరిగే వేడుకలు (CBN-NBK) వినూత్నం. అంతేకాదు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్(Rajanikanth) ఈ వేడుకలకు హాజరు కావడం హైలెట్. గత ఏడాది ఎన్టీఆర్ జయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ ఏడాది మే 26, 27, 28 తేదీల్లో జరిగే వేడుకలతో ముగిస్తాయి. ఏడాది పొడవునగా మినీ మహానాడులను నిర్వహిస్తున్నారు. గత ఏడాది ఒంగోలు కేంద్రంగా జరిగిన మహానాడు వేదిక నుంచి శత జయంతి వేడుకలను ప్రకటించారు. అప్పటి నుంచి ఏడాది మొత్తం వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలో శుక్రవారం జరిగున్న వేడుక శతజయంతి ఉత్సవాల్లో భాగం అయినప్పటికీ ప్రత్యేకతను సంతరించుకుంది.
విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందడి (CBN-NBK)
నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శత జయంతి వేడుకలు (CBN-NBK) శుక్రవారం సాయంత్రం విజయవాడలో జరగనున్నాయి. విలక్షణ నటుడు, రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ 100వ జన్మదిన వేడుకలను ఏప్రిల్ 28న ఘనంగా జరుపుకోనున్నట్లు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఆ మేరకు వీడియో సందేశాన్ని గత వారం పంచుకున్నారు. ఆ వీడియోను చూసిన అభిమానులు పెద్ద ఎత్తున విజయవాడలోని కోరంకి వద్ద ఉన్న అనుమోలు ఫంక్షన్ హాలుకు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajanikanth)ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా (CBN-NBK)వ్యవహరించనున్నారు.
జూనియర్ ఎన్టీఆర్‌ని పిలవలేదనే ఊహాగానాలు సోషల్ మీడియాలో
బాలకృష్ణ టీమ్ ఏర్పాట్లను పరిశీలిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్(Rajanikanth) కూడా శుక్రవారం ఉదయం విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రజనీకాంత్‌ను ఎమ్మెల్యే, హీరో బాలయ్య రిసీవ్ చేసుకున్నారు. అయితే ఈ ఈవెంట్‌కి జూనియర్ ఎన్టీఆర్‌ని పిలవలేదనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా రూమర్స్ తో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భగ్గుమంటున్నారు.
వేడుకలకు హాజరు కావడానికి విజయవాడ వచ్చిన రజనీకాంత్ (Rajanikanth) ను సాదరంగా ఆహ్వానించిన బాలయ్య నేరుగా నోవాటెల్ హోటల్ కు తీసుకెళ్లారు. అక్కడ నుంచి సాయంత్రం మూడు గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన హై టీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత చంద్రబాబు, రజనీకాంత్, బాలయ్య (CBN-NBK)కలిసి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరవుతారు. ఇదంతా ఒక ఎత్తైతే, రజనీకాంత్ తో రాజకీయ పరమైన సంప్రదింపులు ఉంటాయని టీడీపీ వర్గాల్లోని టాక్.
Also Read : NCBN : జగన్ బొమ్మ ఉండాల్సింది మన గోడలపై కాదు.. పోలీస్ స్టేషన్ లో.. ! – చంద్రబాబు
ఢిల్లీ బీజేపీ అగ్రనేతలతో రజనీకాంత్ (Rajanikanth) కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తమిళనాడులో బీజేపీ బలోపేతం కోసం రజనీకాంత్ సహాయాన్ని బీజేపీ అగ్రనేతలు కోరుకుంటున్నారు. పైగా ఆయన కొత్త పార్టీ పెట్టడానికి ప్రయత్నం చేసి వెనక్కు తగ్గడం వెనుక బీజేపీ ఉందన్న టాక్ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో టీడీపీ పొత్తు అనే అంశంపై సంప్రదింపులు ఉంటాయని తెలుస్తోంది. ఆర్ ఎస్ఎస్ అగ్రనేతలతోనూ సన్నిహిత సంబంధాలు రజనీకాంత్ కు ఉన్నాయి. సుదీర్ఘంగా చంద్రబాబు, రజనీకి (CBN-NBK)సాన్నిహిత్యం ఉంది. వేడుకలకు ఆయన రావడానికి రెండు రోజుల ముందు జాతీయ ఛానల్ కు చంద్రబాబు ఇచ్చిన ఇంటర్యూలో నరేంద్ర మోడీ విజన్ ను కొనియాడారు. ఈ పరిణామాలను అవలోకిస్తే, రాజకీయ పరమైన సయోధ్య ఏదో రజనీకాంత్ కుదర్చబోతున్నారని రాజకీయ వర్గాల్లోని చర్చ.
Also Read : CBN : TDPలోకి మాజీ PCC చీఫ్ లు,JC ఆపరేషన్