HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cbn Fire On Jagan 2

AP Capital : జగన్ ను ఊసరవెల్లితో పోల్చిన చంద్రబాబు

హైదరాబాద్‌తో పోటీపడి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా అమరావతిని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇకపై రాజకీయ మార్పులు వచ్చినా రాజధాని విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా

  • Author : Sudheer Date : 28-03-2026 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cbn Jagan
Cbn Jagan

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. తెలుగువారు దశాబ్దాలుగా రాజధానులను కోల్పోతూ, వివక్షకు గురవుతూ వస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ-గోదావరి నదుల మధ్య ఉన్న అమరావతి ప్రాంతానికి శాతవాహనుల కాలం నాటి ఘన చరిత్ర ఉందని, బ్రిటీష్ మ్యూజియంలో సైతం దీనికి ప్రత్యేక గ్యాలరీ ఉండటమే దీని ప్రాచీనతకు నిదర్శనమని గుర్తు చేశారు. 200 ఏళ్ల పాటు మద్రాస్ ప్రెసిడెన్సీలో మన గుర్తింపు కోల్పోయామని, ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాకే ‘మద్రాసీలు’ అనే ముద్ర పోయి ‘ఆంధ్రులు’ అనే గౌరవం దక్కిందని ఆయన పేర్కొన్నారు.

జగన్ తీరుపై ధ్వజమెత్తిన సీఎం

రాజధాని విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన వైఖరిని చంద్రబాబు ‘ఊసరవెల్లి రాజకీయాలు’గా అభివర్ణించారు. 2014లో విభజన సమయంలో సమన్యాయం చేయాలని తాను పోరాడుతుంటే, నాటి వైసీపీ నాయకులు పార్లమెంటులో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని విమర్శించారు. తొలినాళ్లలో అమరావతికి బేషరతుగా మద్దతు తెలిపిన జగన్, అధికారం దక్కగానే మూడు రాజధానుల పేరుతో విషం చిమ్మారని మండిపడ్డారు. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని, అమరావతిపై కుట్రలు చేసి నిర్మాణాలను నిలిపివేసిన వైసీపీ.. ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన పార్టీగా చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు.

అమరావతికి తిరుగులేని చట్టబద్ధత – భవిష్యత్ తరాలకు భరోసా!

రాజధానిని కేవలం ఒక నగరంలా కాకుండా, ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోందని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌తో పోటీపడి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా అమరావతిని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇకపై రాజకీయ మార్పులు వచ్చినా రాజధాని విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ చట్టబద్ధత తీర్మానాన్ని కేంద్రానికి పంపుతున్నట్లు వివరించారు. ఈ ప్రక్రియ పూర్తయితే అమరావతి స్థిరత్వంపై సామాన్యులకు, పెట్టుబడిదారులకు పూర్తి నమ్మకం కలుగుతుందని, ఇది కేవలం ఒక పార్టీ నిర్ణయం కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న చారిత్రక నిర్ణయమని ఆయన పునరుద్ఘాటించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • AmaravatiCapital
  • Andhrapradesh
  • APAssembly
  • APPolitics
  • JaganMohanReddy
  • OneStateOneCapital

Related News

Amaravati Bill Set

Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

Amaravati  అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైతే, వైసీపీ సభ్యులు హాజరుకాకపోవడాన్ని మంత్రి నారా లోకేశ్ తప్పుబట్టారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆ పార్టీకి రాజధానిపై ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ వైఖరితోనే అర్థమవుతోందని విమర్శించారు. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏమిటో, ఆయన జ్ఞానం ఎంతో అందరికీ తెలుస

  • Rajahmundry Kakinada Trains

    Special Train: రాజమండ్రి-కాకినాడ పోర్ట్ స్పెషల్ ట్రైన్: దగ్గుబాటి పురందేశ్వరి

  • Amaravati Capital

    AP Assembly: అమరావతికి చట్టబద్ధత

  • Loan App Harassment Kakinada

    Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు ఎంబీఏ విద్యార్థి బలి

  • Father Kills Daughters Markapuram

    Markapuram: ప్రియురాలి కోసం కన్న కూతురిని హతమార్చిన తండ్రి

Latest News

  • IPL 2026 : ఫస్ట్ మ్యాచ్ లో RCB చేతిలో SRH చిత్తు

  • CM Revanth Reddy: అక్రమ మైనింగ్‌పై సీఎం రేవంత్ ఉక్కుపాదం

  • IPL 2026 : RCB కి 202 టార్గెట్ పెట్టిన SRH

  • Hyderabad : సైబరాబాద్ అనేది చంద్రబాబు విజన్ కు ప్రతిరూపం – పవన్

  • AP Capital : జగన్ ను ఊసరవెల్లితో పోల్చిన చంద్రబాబు

Trending News

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd