CBN : వైనాట్ పులివెందుల!కడపలో CBN 2డేస్ ఆపరేషన్
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య విచారణ వేళ టీడీపీ అధినేత చంద్రబాబు(CBN) కడపకు వెళ్లారు.
- Author : CS Rao
Date : 18-04-2023 - 5:06 IST
Published By : Hashtagu Telugu Desk
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య విచారణ వేళ టీడీపీ అధినేత చంద్రబాబు(CBN) కడపకు వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడే ఆయన ఉంటారు. పార్లమెంట్ స్థాయి సమీక్షలను(Review meeting) జరుపుతారు. అనంపురం, కడప, కర్నూలు జిల్లాలకు సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష చేస్తారు. ఉమ్మడి జిల్లాల పరిధిలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష కూడా చంద్రబాబు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమీక్షలు చేస్తోన్న ఆయన కడప జిల్లా మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వైనాట్ పులివెందుల దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కడపకు (CBN)
గత రెండు రోజులుగా తాడేపల్లి వర్గాల్లో అలజడి నెలకొంది. అనూహ్యంగా ఆదివారం భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తరువాత వైసీపీ వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. నెక్ట్స్ అరెస్ట్ ఎంపీ అవినాష్ రెడ్డి అంటూ ప్రచారం బలంగా జరిగింది. తొలి నుంచి వివేకా మర్డర్ కేసు విషయంలో టీడీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ మేరకు ఆ హత్య జరిగిందని ఆరోపిస్తూ వస్తోంది. ప్రతిగా చంద్రబాబు (CBN) వివేకా హత్య చేయించాడని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆనాడు సీబీఐ విచారణ కూడా కోరారు. ఆ తరువాత సీన్ మారింది. అధికారంలోకి వచ్చిన తరువాత సిట్ ఏర్పాటు చేశారు. దాని మీద నమ్మకం లేకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించిన సునితారెడ్డి సీబీఐ దర్యాప్తును కోరారు. కోర్టు ఆదేశం మేరకు వివేకా మర్డర్ కేసు విచారణ వేగవంతం అయింది. ఇప్పుడు తుది దశకు చేరుకుందని భావిస్తోన్న సమయంలో కడప జిల్లాలో చంద్రబాబు రెండో రోజులు పర్యటన (Review meeting)పెట్టుకోవడం టెన్షన్ గా మారింది.
కడప జిల్లాలో చంద్రబాబు రెండో రోజులు
రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుచుకున్న తరువాత టీడీపీకి (CBN) ధీమా పెరిగింది. ఆ రోజు నుంచి వై నాట్ పులివెందుల టాగ్ తో దూకుడు పెంచింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన వైసీపీ ద్వితీయశ్రేణి ఇటీవల టీడీపీలో భారీగా చేరింది. ఆ నియోజకవర్గం మీద వివేకానందరెడ్డికి పట్టు ఉండేది. ఆయనే ప్రతి ఇంటికీ తిరిగి ప్రచారం చేసే వారు. ఇప్పుడు ఆయన్ను జగన్ అండ్ టీమ్ మర్డర్ చేయించిందని సీబీఐ చెబుతోన్న వేళ వైసీపీని వీడే వాళ్ల సంఖ్య కూడా పెరిగింది. ఇలాంటి పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవడానికి చంద్రబాబు నేరుగా కడపకు వెళ్లారు.
జగన్మోహన్ రెడ్డికి సొంత నియోజకవర్గంలోనూ
కొన్ని దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా రాజకీయం నడుపుతోన్న బీటెక్ రవి, మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి ప్రస్తుతం యాక్టివ్ అయ్యారు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని టీడీపీ విశ్వసిస్తోంది. వైఎస్ కుటుంబంలోని చీలికలను కూడా దగ్గరగా టీడీపీ పరిశీలిస్తోంది. అందరూ కలిసి ఉన్నప్పుడు పులివెందుల మీద వైఎస్ కుటుంబానికి పట్టు ఉండేది. ఇప్పుడు షర్మిలకు అన్యాయం చేశాడని జగన్మోహన్ రెడ్డి మీద అక్కడి ప్రజలకు కూడా అనుమానం ఉంది. బాబాయ్ వివేకాను కూడా పొట్టున పెట్టుకున్నాడని సామాన్యుల్లో చర్చ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ వైఎస్ కుటుంబానికి అక్కడ లేదు. ప్రతికూల పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి సొంత నియోజకవర్గంలోనూ నెలకొన్నాయని టాక్ ఉంది.
Also Read : Jagan : TDP నేత బీటెక్ రవి భద్రతకు ముప్పు, CBN ఆందోళన
ఒక వైపు పాదయాత్రతో లోకేష్ యువతను ఉత్సాహపరుస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఆయనకు వచ్చిన భారీ స్పందన చూశాం. తొలి నుంచి ఆ జిల్లా తెలుగుదేశం పార్టీ (CBN) అనుకూలంగా ఉంటుంది. అలాగే, కర్నూలు జిల్లాలో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆశలు ఆవిరికావడంతో చంద్రబాబు వైపు చూస్తున్నారు. ఇక కడప జిల్లా వ్యాప్తంగా వైఎస్ కుటుంబం మీద చర్చ జరుగుతోంది. అందుకే, ఈ మూడు జిల్లాల మీద చంద్రబాబు రెండో. రోజుల రివ్యూ (Review meeting) పెట్టడంతో పాటు. అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. కొన్ని చోట్ల అభ్యర్థలను ఇంకా ప్రకటించలేదు. అలాంటి స్థానాల్లో ఒక క్లారిటీ ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. మొత్తం మీద రెండు రోజులు కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన ఒక వైపు టెన్షన్ మరో వైపు ఆసక్తి కలిగిస్తోంది.
Also Read : CBN Selfy War : చంద్రబాబు హైటెక్ వార్, జగన్ కు ఛాలెంజ్!