CBN Achievement : చంద్రబాబు తుఫాన్! TDPలోకి బాలినేని?
చంద్రబాబు రాజకీయ తుఫాన్ (CBN Achievement) ఇప్పుడు ఏపీలో కనిపిస్తోంది. ఆయన ఎక్కడ సభలు పెట్టినా జనం కిక్కిరిసిపోతున్నారు.
- Author : CS Rao
Date : 12-08-2023 - 1:44 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ తుఫాన్ (CBN Achievement) ఇప్పుడు ఏపీలో కనిపిస్తోంది. ఆయన ఎక్కడ సభలు పెట్టినా జనం కిక్కిరిసిపోతున్నారు. రాజకీయంగా 40ఏళ్లకు పైగా కొనసాగుతోన్న ఆయన జనానికి కొత్తేమీకాదు. ఆయన స్పీచ్ ఎప్పుడూ వినేదే. పైగా స్పీచ్ బోర్ కొడుతుందని సొంత పార్టీలోని వాళ్లే గతంలో కొందరు విసుక్కునే పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ఆయన స్పీచ్ వినడానికి, ఆయన్ను చూడ్డానికి జనం బారులు తీరుతున్నారు. సభలు పెట్టినా, రోడ్ షో నిర్వహించినా, చివరకు టీవీల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నా జనం టీవీలకు అతుక్కుపోతున్నారు.
బాలినేని తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని ప్రచారం(CBN Achievement)
సరికొత్త ఇలాంటి పరిణామాన్ని చంద్రబాబు దూకుడులో (CBN Achievement) గమనించిన ప్రత్యర్థి పార్టీల ప్రత్యర్థి పార్టీల లీడర్లు సైకిల్ ఎక్కడానికి సిద్దమవుతున్నారు. పార్టీ అధిష్టానం నుంచి టిక్కెట్ హామీ ఇస్తే ప్రత్యర్థి పార్టీల లీడర్లు అనేక మంది పసుపు కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని చంద్రబాబు కోటరీ చెబుతోంది. తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల చాలా కాలంగా ఇలాంటి ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఖాయమంటూ ఆయన అభిమానులు కొందరు చెబుతున్నారు. ఒక వేళ బాలినేని శ్రీనివాసరెడ్డి సైకిల్ ఎక్కితే మాత్రం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ స్వీప్ చేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకుల అంచనా.
Also Read : Balineni : సాయిరెడ్డికి పవర్స్, బాలినేనికి కళ్లెం! టీడీపీ ఎంపీ ఆఫర్?
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి దూరపు బంధువు. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో బాలినేని ఒంగోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూత్ కాంగ్రెస్ నుంచి ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీ తరపున ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఒంగోలు నుంచి గెలుపొందారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డితో ఉన్న బంధుత్వం కారణంగా వైసీపీలో తొలి రోజుల్లోనే చేరారు. అప్పట్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఒంగోలు నుంచి గెలుపొందారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో ఓడినప్పటికీ 2019 ఎన్నికల్లో గెలిచి, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి అయ్యారు.
Also Read : Balineni : జగన్ పొలిటికల్ రివ్యూ, బాలినేని దారెటు?
రాష్ట్ర విద్యుత్, అటవీశాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి రెండేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో హవాలా బిజినెస్ చేశారని ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఆయన సంపాదించిన ఆస్తుల వివరాలను టీడీపీ ఒంగోలు నియోజకవర్గం కేంద్రంగా బయటకు పెట్టింది. ఆయన వియ్యంకుడు అడ్డుఅదుపులేకుండా విశాఖ కేంద్రంగా సెటిల్మెంట్లు చేయడం ద్వారా వేల కోట్లు బాలినేని వెనుకేసుకున్నాడని టీడీపీ అప్పట్లో చేసిన ఆరోపణలు. ఆ దెబ్బకు క్యాబినెట్ 2.0 లో స్థానం లేకుండా పోయింది. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద బాలినేని గుర్రుగా ఉన్నారు. అంతేకాదు, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లను ప్రకాశం జిల్లాల్లో ప్రోత్సహిస్తున్నారని గమనించారు. ఆ విషయాన్ని పలుమార్లు తాడేపల్లి కేంద్రంగా వెలుగుత్తారు. అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పులు లేకపోవడంతో కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసి నిరసన వ్యక్తపరిచారు బాలినేని.
ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసి నిరసన వ్యక్తపరిచారు బాలినేని.
ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనంరామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి వైసీపీని వీడి, టీడీపీలో చేరారు. ఆ రోజు నుంచి ప్రకాశం జిల్లాల్లోనూ బాలినేని శ్రీనివాసరెడ్డి సైకిల్ ఎక్కుతున్నారని ప్రచారం జరిగింది. కానీ, ఆయనకు ఒంగోలు నుంచి పోటీ చేయడానికి టీడీపీ హామీ ఇవ్వలేదు. అక్కడ దామచర్ల జనార్థన్ టీడీపీకి గెలిచే అభ్యర్థిగా ఉన్నారు. ఆయన్ను కాదని బాలినేనికి ఇవ్వలేమని తేల్చేశారు (CBN Achievement) చంద్రబాబు. ప్రత్యామ్నాయంగా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరో ఆప్షన్ కింద మార్కాపురం నుంచి పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ దిశగా టాక్స్ నడుస్తోన్న సమయంలో తాడేపల్లి నుంచి బాలినేనికి అప్పట్లో పిలుపు వచ్చింది. ఈసారి టిక్కెట్ ఇవ్వలేమని బాలినేనికి సంకేతాలిస్తూ ప్రత్యామ్నాయంగా కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి సానుకూలంగా జగన్మోహన్ రెడ్డి స్పందించినట్టు అప్పట్లో వినిపించింది.
చంద్రబాబు సభలకు వస్తోన్న స్పందన (CBN Achievement)
ఇటీవల చంద్రబాబు సభలకు వస్తోన్న స్పందన (CBN Achievement) గమనించిన బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మార్కాపురం నుంచి పోటీ చేయడానికి టీడీపీ తరపున సిద్దమయినట్టు వినిపిస్తోంది. ఒక వేళ టీడీపీ, జనసేన పొత్తు ఉంటే దర్శి నుంచి జనసేన పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నట్టు టాక్. లేదంటే , జనసేన పార్టీ తరపున ఒంగోలు లోక్ సభ అభ్యర్థిగా పోటీకి దిగుతారని సరికొత్త ప్రచారంకు బీజం పడింది. బాలినేని మాత్రం ఆయనపై జరుగుతోన్న ప్రచారాన్ని ఖండిస్తున్నారు. కానీ, రాజకీయాల్లో దేన్నీ తీసిపాచేయలేం. గుర్రం ఎగరావచ్చు.!