YS Bhaskar Reddy: బిగ్ బ్రేకింగ్.. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy), ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
- By Gopichand Published Date - 07:36 AM, Sun - 16 April 23

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy), ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. పులివెందులలోని ఆయన నివాసానికి ఆదివారం ఉదయాన్నే చేరుకున్న అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ కడపకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లో ఉన్న ఆయన కుమారుడు ఎంపీ అవినాశ్ ఇంటికి కూడా సీబీఐ అధికారులు వెళ్లారు.
Also Read: Massive Fire Accident: బ్రేకింగ్.. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి గతంలో ఆరోపించారు. అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి. మేం అన్నింటికీ సిద్దమే అని ఆయన గతంలో కూడా స్పష్టం చేశారు. వివేకా హత్య కేసులో ఇప్పటికే ఒకసారి భాస్కర్ రెడ్డిని, ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ పలుమార్లు విచారించింది. హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖపై సీబీఐ ఎందుకు విచారణ చేయడం లేదని భాస్కర్ రెడ్డి గతంలో ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అవినాశ్ రెడ్డి అన్ని విషయాలు చెప్పారని.. తాను చెప్పేది ఏమీలేదని కూడా వివరించారు.