Harsha Kumar : మాజీ ఎంపీ హర్ష కుమార్‌పై కేసు నమోదు
పాస్టర్ ప్రవీణ్ పగడాలను ఎక్కడో హత్య చేసి.. రోడ్డు పక్కన విసిరేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని, పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని దీనిపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
- By Latha Suma Published Date - 01:25 PM, Sat - 5 April 25

Harsha Kumar : మాజీ ఎంపీ హర్ష కుమార్ కు బిగ్ షాక్ తగిలింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో తప్పుడు ఆరోపణలు చేశారనే నేరంపై బీఎన్ఎస్ సెక్షన్లు 196, 197 ప్రకారం మాజీ ఎంపీ హర్ష కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. పాస్టర్ ప్రవీణ్ పగడాలను ఎక్కడో హత్య చేసి.. రోడ్డు పక్కన విసిరేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని, పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని దీనిపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మాజీ ఎంపీ వ్యాఖ్యలపై స్పందించిన పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.
Read Also: Sri Ramanavami : నేడు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలతో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఆయన పోలీసుల విచారణకు హాజరు కాకపోతే మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో మాజీ ఎంపీ హర్షకుమార్ పై ఈ రోజు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తనపై నమోదైన కేసులపై హర్ష కుమార్ స్పందిస్తూ తనకు ఎలాంటి సమాచారం దీనిపై లేదన్నారు.
కాగా, పాస్టర్ ప్రవీణ్ పగడాల గన నెల చివరి వారంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై క్రిస్టియన్ సంఘాలు అనుమానం వ్యక్తం చేశారు. పాస్టర్ ప్రవీణ్ కు ఎవరో కావాలనే హత్య చేశారని ప్రభుత్వం, పోలీసులు నిందితులను పట్టుకోవాలని పాస్టర్ల సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి.. సమగ్ర విచారణ జరపాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ పాస్టర్ మృతిపై కీలక ఆరోపణలు చేశారు.