Kolikapudi Srinivasa Rao : టీడీపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. కేసు నమోదు
పోలీసులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన మొత్తం 60 మంది నాయకులపై కేసులు నమోదు చేశారు
- By Sudheer Published Date - 09:01 AM, Thu - 4 July 24

ఎన్టీఆర్(D) తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ (Kolikapudi Srinivasa Rao) అత్యుత్సాహం కారణంగా కేసు నమోదైంది. కూటమి పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వైసీపీ నేతల అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అక్రమంగా నిర్మించిన వైసీపీ పార్టీ ఆఫీస్ లనే కాదు ఆయా నేతల నిర్మాణాలను సైతం కూల్చడం..నోటీసులు జారీ చేయడం చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా కంభంపాడులో ఎంపీపీ భర్త కాలసాని చెన్నారావు నిర్మిస్తున్న భవనం అక్రమం అంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నేరుగా ఆందోళనకు దిగారు. ఆ భవనాన్ని కూల్చివేయాలని ఆయన డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించారు. అంతే కాదు స్వయంగా జేసీబీ ని తీసుకొచ్చి కొంతమేర కూల్చేపించారు. చివరకు అధికారుల కోరిక మేరకు ఎమ్మెల్యే, అతడి అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఎంపీపీ నాగలక్ష్మి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన మొత్తం 60 మంది నాయకులపై కేసులు నమోదు చేశారు. 167/2024 గా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏ. కొండూరు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత శ్రీనివాస్ సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
పదవి శాశ్వతం కాదని.. బాధితులకు న్యాయం చేయలేనపుడు తన లాంటి వారు రాజకీయాల్లో కూడా అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఘటనకు ముందు సోషల్ మీడియా ద్వారా ప్రకటించినా అధికారులు స్పందించలేదని, చివరికి తాను స్వయంగా రంగంలోకి దిగి, గత్యంతరం లేక వేలాది మంది బాధితులతో నిరసన చేపట్టిన తర్వాత చివరికి నోటీసులిచ్చి నిర్మాణం ఆపారని పేర్కొన్నారు. చెన్నారావు నలుగురిని కొట్టి వాళ్ల స్థలాలు లాక్కొని, పక్కనున్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడని, అక్రమ నిర్మాణం ఆపాలని రెవెన్యూ అధికారులకు చెబితే.. అతడిని రక్షించేందుకు వంద కథలు చెప్పారని పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఫై సీఎం చంద్రబాబు..శ్రీనివాస్ తో ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తుంది.
Read Also : IND vs ZIM : భారత్ వర్సెస్ జింబాబ్వే టీ20 సిరీస్.. ఫ్రీగా మ్యాచులను చూడొచ్చా..?