Kadapa : వైఎస్ షర్మిలపై కేసు నమోదు చేసిన పోలీసులు
మే 2వ తేదీన బద్వేల్ బహిరంగ సభలో వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసు గురించి ప్రసంగించారని.. షర్మిలపై బద్వేల్ నోడల్ అధికారి, మున్సిపల్ కమిషనర్‌లు ఫిర్యాదు చేశారు
- Author : Sudheer
Date : 06-05-2024 - 9:37 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ పీసీసీ చీఫ్, కడప పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలపై(YS Sharmila) కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల ప్రచారంలో షర్మిల తన దూకుడు ను కనపరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అన్న జగన్ ఫై , అలాగే అవినాష్ రెడ్డి లపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా తన బాబాయ్ వివేకా హత్య విషయాన్నీ పదే పదే ప్రస్తావిస్తూ..తన బాబాయ్ ని చంపింది అవినాష్ రెడ్డి అంటూ ఇన్ డైరెక్ట్ గా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. హత్య చేసిన వ్యక్తిని జగన్ రక్షిస్తున్నాడని తెలుపుతూ ప్రజలను ఓట్లు అడుగుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే క్రమంలో మే 2వ తేదీన బద్వేల్ బహిరంగ సభలో వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసు గురించి ప్రసంగించారని.. షర్మిలపై బద్వేల్ నోడల్ అధికారి, మున్సిపల్ కమిషనర్‌లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఎఫ్ ఐఆర్ 168 , ఐపిసి సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల నేపథ్యంలో వివేకా హత్య కేసు గురించి ఎక్కడ ప్రస్తావించకూడదని కడప కోర్టు ఇప్పటికే ఆదేశించడం జరిగింది. అయినప్పటికీ షర్మిల హత్య ప్రస్తావనను తీసుకొస్తుందంటూ .. కోర్టు ఆదేశాలను దిక్కరిస్తుందంటూ వైఎస్ షర్మిల ఫై అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బద్వేల్ పీఎస్‌లో ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. షర్మిలపై కేసు నమోదు చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు సహా విపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Rythu Bandhu : మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్.. రైతు బంధు నిధులు విడుదల