APPSC Group-1 Exams : వాల్యుయేషన్ అవకతవకల్లో ఐపీఎస్ సీతారామాంజనేయులు పాత్ర
APPSC Group-1 Exams : అసలు సమీక్ష లేకుండానే OMR షీట్లపై మార్కులు వేసి ఫలితాలు విడుదల చేసిన ఘటన పైశాచిక చర్యగా అభిప్రాయపడుతున్నారు
- By Sudheer Published Date - 03:51 PM, Wed - 14 May 25

(APPSC) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మాన్యువల్ ఈవాల్యుయేషన్ ప్రక్రియలో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నట్టు తాజా విచారణల్లో తేలింది. ఈ వ్యవహారంలో మాజీ ఏపీపీఎస్సీ సెక్రటరీగా పనిచేసిన ఐపీఎస్ అధికారి పెండ్యాల సీతారామాంజనేయులు (PSR Anjaneyulu) కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఆయనపై ఐపీసీ సెక్షన్‌లు 420, 409, 477-A, 120-B కింద కేసులు నమోదయ్యాయి. కొర్టు ఆదేశాలను విస్మరించి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రైవేట్ సంస్థలకు మాన్యువల్ ఈవాల్యుయేషన్ బాధ్యతలు అప్పగించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Driving License : సెన్సార్ విధానాన్ని తీసుకొచ్చిన ఏపీ.. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ అంత ఈజీ గా రాదు..!!
పోలీసుల ప్రకారం.. సీతారామాంజనేయులు “Camsign Media Pvt. Ltd.” అనే ప్రైవేట్ సంస్థను ఎంపిక చేసి, సరైన అర్హతలు లేని వ్యక్తుల ద్వారా సమీక్షను “హాయిల్యాండ్ రిసార్ట్స్” అనే ప్రైవేట్ టూరిజం కేంద్రంలో నిర్వహించారు. గతంలో ఎప్పుడూ ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే నిర్వహించబడే ఈ సమీక్షా శిబిరాన్ని రహస్యంగా ప్రైవేట్ ప్రాంగణంలో నిర్వహించడం సంచలనం రేపింది. ఈ ప్రక్రియలో సుమారు రూ. 1.14 కోట్ల వరకు ప్రైవేట్ కంపెనీకి చెల్లించబడినట్టు, రూ. 20 లక్షల వరకు రిసార్ట్‌కి వెళ్లినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఈ వ్యవహారం ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని కుదించే విధంగా ఉన్నది. ముఖ్యంగా కోర్టు ఆదేశాల్ని త్రోసిపుచ్చి, అసలు సమీక్ష లేకుండానే OMR షీట్లపై మార్కులు వేసి ఫలితాలు విడుదల చేసిన ఘటన పైశాచిక చర్యగా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం PSR అంజనేయులు న్యాయకస్టడీలో ఉన్నారు. అతనిపై మరో కేసులో కూడా P.T. వారెంట్ వేయాలని పోలీసులు కోరిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వల్ల అధికార బాధ్యతలపట్ల మరింత కఠినమైన నియంత్రణ అవసరమని ప్రజల్లో చర్చ నడుస్తోంది.