Vehicles Registrations : వాహనాలను పొరుగు రాష్ట్రాల్లో కొని ఏపీలో రిజిస్ట్రేషన్లు.. రంగంలోకి రవాణాశాఖ
ఏపీవాసులు పొరుగు రాష్ట్రాల్లో వాహనాలు కొనడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి సగటున రూ.100 కోట్ల దాకా జీఎస్టీ ఆదాయాన్ని(Vehicles Registrations) కోల్పోతోంది.
- By Pasha Published Date - 01:51 PM, Sat - 7 December 24

Vehicles Registrations : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో కొత్త కార్లు, బైక్స్, స్కూటర్స్ కొంటున్నారు. అక్కడ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. అయితే ఏపీకి తీసుకొచ్చి జీవిత పన్ను చెల్లించి, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ప్రతీ వాహనాన్ని కొనేటప్పుడు జీఎస్టీ ఛార్జీలను కట్టాల్సి ఉంటుంది. ఏపీకి చెందినవారు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో వాహనాలను కొనేటప్పుడు 28 శాతం దాకా జీఎస్టీ కడుతున్నారు. ఒకవేళ వాహనాన్ని ఏపీలోనే కొంటే.. జీఎస్టీ ఆదాయంలో సగం (14 శాతం) రాష్ట్ర ఖజానాలోకి చేరుతుంది. అలా జరగకపోవడంతో జీఎస్టీ ఆదాయాన్ని ఏపీ ప్రభుత్వం కోల్పోతోంది.
Also Read :5 Lakh Runs : 5 లక్షల రన్స్.. టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ తిరుగులేని రికార్డు
ఆ వాహనదారులకు ఇక ట్రబులే..
ఏపీవాసులు పొరుగు రాష్ట్రాల్లో వాహనాలు కొనడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి సగటున రూ.100 కోట్ల దాకా జీఎస్టీ ఆదాయాన్ని(Vehicles Registrations) కోల్పోతోంది. ఇటీవలే ఈ అంశాన్ని ఏపీ రవాణా శాఖ ఉన్నతాధికారులు నేరుగా సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. ఆయన స్పందిస్తూ.. ఏపీవాసులు పొరుగు రాష్ట్రాల్లో కొనే వాహనాలకు ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్‌కు అనుమతించొద్దని నిర్దేశించారు. పొరుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలను ఏపీలో నెలకు మించి నడపకూడదు. ఆ వాహనాలను ఇక్కడే వినియోగించాలని భావిస్తే తొలుత రిజిస్ట్రేషన్ జరిగిన పొరుగు రాష్ట్రం నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం తీసుకురావాలి. దాన్ని ఏపీ రవాణాశాఖకు సమర్పించి, జీవిత పన్ను చెల్లించి ఇక్కడి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన చాలా వాహనాలను ఏపీలో శాశ్వతంగా వినియోగిస్తున్నా రవాణాశాఖ పెద్దగా పట్టించుకోవడం లేదు.
Also Read :Bajaj Chetak EV : సూపర్ ఫీచర్స్, ఆకట్టుకునే లుక్‌తో బజాజ్ చేతక్.. డిసెంబరు 20న విడుదల
ప్రతి వాహన కంపెనీకి డీలర్లు ఉంటారు. వారికి ఒక నగరం, జిల్లాల పరిధి ఉంటుంది. అక్కడి వారికి మాత్రమే వాహనాలు విక్రయించాల్సి ఉంటుంది. అయినా పొరుగు రాష్ట్రాల్లోని డీలర్లు ఏపీ వారికి కూడా యథేచ్ఛగా వాహనాలు అమ్ముతున్నారు. దీంతో వాహనాలు విక్రయించే పరిధిపై ఆయా వాహనాల డీలర్లను విచారించాలని ఏపీ రవాణా శాఖ అధికారులు యోచిస్తున్నారు.