Kadiri భవనం కూలిన శిధిలాలు పక్క బిల్డింగ్ లపై పడడంతో కూలిపోయిన మరో రెండు భవనాలు
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు పలుచోట్ల ప్రమాదాలకు దారి తీస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలో కదిరిలో వర్షానికి తడిచి మూడంతస్తుల భవనం కుప్పకూలింది.
- By Hashtag U Published Date - 09:51 AM, Sat - 20 November 21

కదిరి, అనంతపురం: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు పలుచోట్ల ప్రమాదాలకు దారి తీస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలో కదిరిలో వర్షానికి తడిచి
మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ శిథిలాల కింద 11 మంది చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం.
ఘటన జరిగిన వెంటనే అధికారులు, సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
క్షతగాత్రులను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలిస్తున్నారు.
మూడు అంతుస్తుల పాత భవనం వర్షానికి తడిచి కూలిపోయి పక్కనే ఉన్న రెండు అంతస్తుల భవనంతో పాటు, మరో ఇంటిపై కుప్పకూలింది. దీంతో ఆ రెండు భవనాలు కూడా కూలిపోయాయి.
గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే పాత భవనం గోడలు కూలి ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.
శిథిలాలను పూర్తిగా తొలగిస్తేనే ప్రాణనష్టం అంచనా వేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
Related News

Rain Alert : ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు
Rain Alert : ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.