Buddha Venkanna : కొడాలి నాని నీకు బడితపూజ తప్పదు – బుద్ధా వెంకన్న
- Author : Sudheer
Date : 18-12-2023 - 7:07 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న (Buddha Venkanna)..వైసీపీ మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి (Kodali Nani) నాని నీ హెచ్చరించారు. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకని మాట్లాడు.. లేకపోతే బడితపూజ తప్పదు.. మరో మూడు నెలలు ఆగితే…ఇప్పుడు వాగుతున్న వారందరి నోళ్లు మూతపడటం తప్పదని వెంకన్న హెచ్చరించారు. మరో మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ వైసీపీ తో పాటు టీడీపీ – జనసేన ఇలా అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇక ఈసారి ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు పార్టీలు పొత్తులకు సంబదించిన అంశాలు , అభ్యర్థుల తాలూకా వివరాలు..ఇలా అన్ని మాట్లాడుకోవడం చేస్తున్నారు. నిన్న సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి కార్యాచరణ , మేనిఫెస్టో తదితర విషయాల గురించి మాట్లాడడం జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో వైసీపీ నేతలు వీరి కలయికపై రకరకాలుగా విమర్శలు , ఆరోపణలు చేయడం చేస్తున్నారు. వీరిపై ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సమావేశమైనప్పటి నుంచి అధికార వైసీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోతుందని ..ఇద్దరి నేతల కలయికకు భయపడే మాజీమంత్రి కొడాలి నాని ఇష్టం వచ్చినట్లు అవాక్కులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కలిస్తే మీకెందుకు భయమని నిలదీశారు. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకని మాట్లాడాలని లేకపోతే బడితపూజ తప్పదని గట్టిగా హెచ్చరించారు. మరో మూడు నెలలు ఆగితే…ఇప్పుడు వాగుతున్న వారందరి నోళ్లు మూతపడటం తప్పదని, ఇలాగే వాగితే వీరికి బుద్ధి వచ్చేలా టీడీపీ కేడర్ గట్టిగా సమాధానం చెప్తోందని వార్నింగ్ ఇచ్చారు.
Read Also : Operation Valentine : పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ నుంచి రాబోయే సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ టీజర్ రిలీజ్..