Brahmaji Tweet : నేను ఆ పోస్ట్ పెట్టలేదు..నా ఎక్స్ ఖాతాని ఎవరో హ్యాక్ చేశారు – బ్రహ్మజీ
Brahmaji satirical tweet On Jagan : ''మీరు కరెక్ట్ సార్.. వాళ్ళు చెయ్యలేరు.. ఇకనుంచి మనం చేద్దాం.. ఫస్ట్ మనం రూ.1000 కోట్లు విడుదల చేద్దాం. మన వైకాపా కేడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం .. మనకి జనాలు ముఖ్యం.. ప్రభుత్వం కాదు. మనం చేసి చూపిద్దాం సార్.. జై జగన్ అన్నా''
- By Sudheer Published Date - 11:29 AM, Sun - 8 September 24

Brahmaji satirical tweet On Jagan : నటుడు బ్రహ్మజీ (Actor Brahmaji )..సినిమాల్లోనే కాదు సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. సమాజంలో పలు సమస్యల స్పందిస్తూ ఉంటారు. తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (Jagan) ఫై ఆయన చేసిన ట్వీట్ ఫై వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండడం తో..ఆ ట్వీట్ తాను చేయలేదని..నా ఎక్స్ ఖాతాని ఎవరో హ్యాక్ చేసారని బ్రహ్మజీ క్లారిటీ ఇచ్చారు.
అసలు ఆ ట్వీట్ లో ఏముందంటే…గత కొద్దీ రోజులుగా తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy rains in Telugu states) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరం భారీ వరదకు , వర్షాలకు అతలాకుతలమైంది. ఈ క్రమంలో వారం రోజులుగా సీఎం దగ్గరి నుండి ప్రతి ఒక్క అధికారి , మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు సాయం అందజేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ జగన్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేసాడు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
ఫస్ట్ మనం రూ.1000 కోట్లు విడుదల చేద్దాం
“క్షేత్రస్థాయిలో జరుగుతున్న సాయం మీకు కనపడటం లేదా..? ఐదేళ్ల పాటు మీరు చేసిన నిర్వాకం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. రాజకీయంగా ఆడే ఆట కాదు. ఇది ప్రజల జీవితం” అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఇదే క్రమంలో బ్రహ్మాజీ కూడా జగన్ ట్వీట్ ఫై స్పందించారు. ”మీరు కరెక్ట్ సార్.. వాళ్ళు చెయ్యలేరు.. ఇకనుంచి మనం చేద్దాం.. ఫస్ట్ మనం రూ.1000 కోట్లు విడుదల చేద్దాం. మన వైకాపా కేడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం .. మనకి జనాలు ముఖ్యం.. ప్రభుత్వం కాదు. మనం చేసి చూపిద్దాం సార్.. జై జగన్ అన్నా” అంటూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఫై వైసీపీ శ్రేణులు ఎదురుదాడికి దిగడం తో..”నా ఎక్స్ (ట్విటర్) ఖాతాని ఎవరో హ్యాక్ చేశారు. నాకు ఆ ట్వీట్‌కు సంబంధం లేదు. ఫిర్యాదు కూడా చేశాం” అని బ్రహ్మాజీ పేర్కొన్నారు. మరి నిజంగా ఆ ట్వీట్ బ్రహ్మాజీ పెట్టాడో లేదో కానీ ఆయనపై మాత్రం వైసీపీ శ్రేణులు పీకల్లోతు కోపంతో ఉన్నారు.
Naa X అకౌంట్ ఏవోరో hack చేసి ట్వీట్ చేసారు .. నాకు ఆ tweet కి సంబంధం లేదు ..కంప్లైంట్ చేసాం ..🙏🏼🤗
— Brahmaji (@actorbrahmaji) September 8, 2024
Read Also : Heavy Flood Inflow To Budameru Vagu : విజయవాడకు మరో టెన్షన్..