Botsa Walkout: బొత్స వాకౌట్: విగ్రహాల వివాదంపై మండలిలో హీటెక్కిన చర్చ
విభిన్న స్థానాల్లో అనధికారికంగా ఏర్పాటైన విగ్రహాలపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.
- By Dinesh Akula Published Date - 02:22 PM, Wed - 24 September 25
Botsa Walkout: ఆంధ్రప్రదేశ్ మండలిలో విగ్రహాల ఏర్పాటుపై చర్చ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. టీడీపీ సభ్యులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ, విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా విస్మయం వ్యక్తం చేశారు. మాజీ సీఎంను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ, ఆయన సభ నుంచి వాకౌట్ చేసినట్టు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు.
విభిన్న స్థానాల్లో అనధికారికంగా ఏర్పాటైన విగ్రహాలపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2524 విగ్రహాలు అనధికారంగా ఏర్పాటు అయ్యాయని తెలిపారు. అందులో జాతీయ రహదారులపై 38, రాష్ట్ర రోడ్లపై 1671, రాష్ట్ర హైవేలపై 815 విగ్రహాలు ఉన్నట్లు వివరించారు.
ఇవన్నీ ప్రభుత్వ అనుమతుల్లేకుండా ఏర్పాటు చేసినవని, వీటి ఏర్పాటుపై 2013 ఫిబ్రవరిలో జారీ చేసిన జీవో నెంబర్ 18 ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజా ప్రదేశాల్లో విగ్రహాలు, కట్టడాలు వేయకూడదని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని గుర్తు చేశారు. పబ్లిక్ యుటిలిటీ పనులకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేశారు.
పులివెందులలో కూడళ్ల సుందరీకరణ కోసం రూ.3.50 కోట్లు, కడప పట్టణంలో సర్కిళ్ల అభివృద్ధికి రూ.7.21 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి తెలిపారు. 2019 తర్వాత ఏ విగ్రహానికి అనుమతి ఇవ్వలేదని, అలాగే ఎవరైనా తొలగించాలన్నా అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. అనధికారిక విగ్రహాలపై కలెక్టర్లకు చర్యలు తీసుకునేలా already సూచనలు ఇచ్చినట్టు వివరించారు.
విభేదాలు తీవ్రరూపం దాల్చినా, అధికార పక్షం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాత్రం సభ్యుల మాటలపై తీవ్రంగా స్పందిస్తూ, అసహనంతో మండలి నుంచి నడుచుకుని వెళ్లిన విషయం సభలో దృష్టి ఆకర్షించింది.