YCP : వామ్మో.. వైసీపీ ఓటమిని కర్ణుడి చావుతో లింక్ పెట్టిన బొత్స
YCP : “కర్ణుడి చావుకు వంద కారణాలు ఉన్నట్టు, వైసీపీ ఓటమికి కూడా వంద కారణాలు ఉన్నాయి” అంటూ ఆయన మహాభారత కథనంతో పోలిక ఇచ్చారు.
- By Sudheer Published Date - 12:50 PM, Tue - 6 May 25

వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ (YCP) ఘోర ఓటమి చవిచూసిన నేపథ్యంలో బొత్స ఈ ఓటమికి కారణాలపై స్పందించారు. “కర్ణుడి చావుకు వంద కారణాలు ఉన్నట్టు, వైసీపీ ఓటమికి కూడా వంద కారణాలు ఉన్నాయి” అంటూ ఆయన మహాభారత కథనంతో పోలిక ఇచ్చారు. వాస్తవానికి తాము చేపట్టిన పథకాలు ప్రజల్లోకి సరిగా వెళ్లలేకపోవడమే ప్రధాన కారణం అని ఆయన పేర్కొన్నారు.
Mahanadu 2025 : ‘మహానాడు’కు స్వర్గీయ నందమూరి తారకరామారావుకు ఆహ్వానం
ఇక మరోవైపు టీడీపీ (TDP) అనుకూల మీడియా చేసిన వ్యతిరేక ప్రచారం కూడా ఓటమిలో కీలకపాత్ర పోషించిందని బొత్స అభిప్రాయపడ్డారు. పార్టీ నాయుకుల మధ్య అంతర్గత విభేదాల అంశాన్ని కొట్టిపారేసిన ఆయన, “మనమే మనపై దాడి చేస్తామా?” అంటూ అది ఒక అసత్య ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. విపక్షాలు గట్టి ప్రచారం చేయగా, తమ ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలియకుండా పోయినట్టు అభిప్రాయపడ్డారు.
రాజధాని అమరావతికి ప్రధాని మోదీ (Modi) వచ్చిన ఉద్దేశం ఏంటో తనకూ అర్థం కావడం లేదని బొత్స వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏ పనీ చేయలేదని, రైతుల బాదలను అర్థం చేసుకునే శక్తి కూడా లేదని ఆయన ఆరోపించారు. లక్షా 50 వేల కోట్ల రూపాయల అప్పులు చేసిన కూటమి ప్రభుత్వం, ఆ మొత్తాన్ని ఎలా వినియోగించిందన్నది కూడా ప్రజలకు తెలియడం లేదని పేర్కొన్నారు. త్వరలోనే వైఎస్ జగన్ మళ్లీ ప్రజల్లోకి వచ్చి వారి సమస్యలు స్వయంగా తెలుసుకుంటారని, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.