AP Fibernet Scam : సుప్రీం కోర్ట్ లో ఆగిపోయిన చంద్రబాబు ఫైబర్‌నెట్ కేసు విచారణ
- Author : Sudheer
Date : 17-01-2024 - 5:15 IST
Published By : Hashtagu Telugu Desk
చంద్రబాబు ఫైబర్‌నెట్ కేసు (AP Fibernet Scam) విచారణలో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్న మంగళవారం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో.. సీజేఐకి అప్పగించిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఏపీ ఫైబర్ నెట్ కేసు (AP Fibernet Scam)లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. కానీ అయితే జస్టిస్ బేలా ఎం. త్రివేది మరో కేసు విచారణలో బిజీగా ఉండడంతో ఇవాళ్టి విచారణ ఆగిపోయింది. దీంతో మరో రోజు పిటిషన్పై విచారణ జరుపుతామని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
గతంలో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేయగా.. బెయిల్‌ను నిరారించిన విషయం తెలిసిందే. దీనితో సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. కాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంలో వేసిన ఫిటీషన్ పై నేడు జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలాఎం త్రివేదీల ధర్మాసనం విచారణకు ఆదేశించింది. చంద్రబాబు తరపున వాదించడానికి సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా సుప్రీంకోర్టుకు వచ్చారు. అటు ఏపీ ప్రభుత్వం తరపున ఏఓఆర్ హాజరయ్యారు. ఈ కేసులో ఎలాంటి తీర్పు రానుంది? చంద్రబాబుకి బెయిల్ లభిస్తుందా? లేదా? అనేది ఉత్కంఠకు దారితీసింది. అయితే, చివరి నిమిషంలో విచారణ వాయిదా పడింది.
Read Also : Raja Saab: ప్రభాస్ రాజా సాబ్ కథ ఇదేనా.. మారుతి ఏం చెప్పాడంటే