HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Bihar Bjp Leaders Welcomed Pawan Kalyans Decision

Sanatana Dharma : పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతించిన బిహార్ బీజేపీ నేతలు

Sanatana Dharma : బిహార్ మంత్రి నీరజ్ బాబు ఈ విధమైన వింగ్ బిహార్లో కూడా అవసరమని , సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు

  • Author : Sudheer Date : 03-11-2024 - 8:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Warning To YCP
Pawan Warning To YCP

జనసేన అధినేత, ఏపీడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సనాతన ధర్మ పరిరక్షణ(Sanatana Dharma)కు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడాన్ని బిహార్ బీజేపీ నేతలు (Bihar BJP Leaders) స్వాగతించారు. బిహార్ మంత్రి నీరజ్ బాబు ఈ విధమైన వింగ్ బిహార్లో కూడా అవసరమని , సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ RJD నేత మృత్యుంజయ్ తివారీ మాత్రం ఈ నిర్ణయంపై విమర్శలు చేశారు. ఆయన ఈ చర్యను ప్రజల క్షేత్రస్థాయి సమస్యల నుండి దృష్టి మరల్చడానికి చేసిన ప్రయత్నమని, ఈ విధంగా ప్రచారం చేసే నేతలందరూ నకిలీ సనాతనీయులని ఆరోపించారు. ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ హిందూత్వ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. తాజాగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకోవడం రకరకాల చర్చలకు కారణం అవుతోంది. నరసింహ వారాహి గణం పేరుతో త్వరలోనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తానని పవన్ ప్రకటించారు. ఇవి అదికారికంగా జనసేన పార్టీకి అనుబందంగా ఉన్నట్లుగా ప్రకటించినా ప్రకటించకపోయినా ఆ పార్టీ హిందూత్వ కార్యకర్తలే అందులో ఉంటారని అనుకోవచ్చు. బీజేపీకి ఇలాంటి గ్రూప్ భజరంగ్ దళ్ ఉంటుంది. అలాగే అనేక హిందూ సంస్థలకూ బీజేపీ పరోక్షంగా మద్దతు ఇస్తుంది. వాటి ఏర్పాటులోనూ కీలంగా వ్యవహరించింది. ఇప్పుడు భజరంగ్ దళ్ తరహాలో పవన్ కల్యాణ్ ఈ నారసింహ వారాహి గణాన్ని నియమించనున్నారని భావించవచ్చు.

జనం కోసమే పుట్టిన జనసేన.. ఇప్పుడు.. సనాతన సేనగా మారుతోందా? సనాతన ధర్మ పరిరక్షణకు సిద్ధమైన పవన్ కల్యాణ్.. పార్టీ సిద్ధాంతాన్ని కూడా మార్చే ఆలోచనలో ఉన్నారా? తిరుమల లడ్డూ వివాదం తర్వాత.. పవన్ కల్యాణ్ భాష మారింది. వేషం మారింది. ఆయన సిద్ధాంతమే మారిపోయింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Ration card : సంక్రాంతి తర్వాత సన్నబియ్యం పంపిణీ : మంత్రి ఉత్తమ్..! 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bihar
  • bjp
  • Pawan Kalyan
  • sanatana dharma

Related News

Nani Pawan

Nani Big Shock to Pawan Kalyan : నాని మాస్ ‘షేర్’ దెబ్బకు పవన్ ‘ఉస్తాద్’ విలవిల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" చిత్రం నుండి విడుదలైన 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పాటపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

  • Allu Sirish Wedding

    అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. పవన్ కళ్యాణ్ దంపతులకు ఆహ్వానం!

  • Allu Sirish invites Pawan Kalyan and Naga Babu

    అల్లు శిరీష్ పెళ్లి..పవన్‌ కల్యాణ్‌, నాగబాబులకు శుభలేఖ

  • Sunil Naik Arrested In Raghuramakrishna Raju Custodian Torture Case

    రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు .. ఏపీ పోలీసుల అదుపులో సునీల్ నాయక్

  • Konidela Village

    కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

Latest News

  • Pensions : చేయూత పింఛన్లను రూ.500 పెంచబోతున్న తెలంగాణ సర్కార్

  • Transfer of IASs : తెలంగాణలో భారీగా IASల బదిలీ

  • Annapurna Studios : చిత్రసీమకు గుడ్ న్యూస్.. హాలీవుడ్ టెక్నాలజీని తీసుకొచ్చిన అన్నపూర్ణ స్టూడియో !!

  • Rashmika Mandanna-Vijay Deverakonda Wedding : మూడుముళ్లతో ఒక్కటైనా విజయ్-రష్మిక

  • Attack on Health Minister : మంత్రి పై దాడి

Trending News

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd