HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Big Shock To Ysrcp In Vizag Mayors Post Falls Into Alliances Hands

GVMC Mayor Seat: విశాఖలో వైసీపీకి బిగ్ షాక్.. మేయర్ పీఠం కూటమి ఖాతాలోకి!

విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జీవీఎంసీలో కూటమి విజయం సాధించింది. 74 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 19-04-2025 - 1:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gvmc Mayor Seat
Gvmc Mayor Seat

GVMC Mayor Seat: మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయం సాధించింది. అవిశ్వాసానికి మద్దతుగా 74 మంది కార్పొరేటర్లు ఓటు వేశారు. దీంతో గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెర పడింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ఇంఛార్జ్ కమిషనర్ మరియు జిల్లాకలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీకి చెందిన కార్పొరేటర్లు హాజరుకాలేదు. ఇక విశాఖపట్నం కొత్త మేయర్‌గా పీలా శ్రీనివాసరావును ఒకటి రెండు రోజుల్లోనే ఎన్నుకునే అవకాశముందని తెలుస్తోంది.

విశాఖపట్నం మేయర్‌పై అవిశ్వాస తీర్మానం వెలువడిన తర్వాత జీవీఎంసీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. వైఎస్సార్‌సీపీ మరియు కూటమి పార్టీలు తమ తమ కార్పొరేటర్లను క్యాంపులకు తరలించారు. కూటమి కార్పొరేటర్లు మలేషియా వెళ్లగా, వైఎస్సార్‌సీపీకి చెందిన వారు మొదట బెంగళూరుకు, అనంతరం శ్రీలంకకు వెళ్లారు.

అవిశ్వాస తీర్మానం శనివారం జరగనున్న నేపథ్యంలో, కూటమి కార్పొరేటర్లు శుక్రవారం రాత్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడినుంచి వారిని కూటమి ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా హోటల్‌కు తరలించారు. శనివారం ఉదయం 10 గంటలకు ఈ కార్పొరేటర్లు జీవీఎంసీకి వచ్చారు. ఇక శ్రీలంకలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఈ సమావేశానికి హాజరుకాలేదు. వారు ఒకటి రెండు రోజుల్లో విశాఖపట్నం తిరిగి చేరుకునే అవకాశం ఉందని సమాచారం.

జీవీఎంసీలో మొత్తం 97 మంది సభ్యులు ఉన్నారు. పార్టీల బలాన్ని చూసుకుంటే — టీడీపీకి 48 మంది, వైఎస్సార్‌సీపీకి 30 మంది, జనసేనకు 14 మంది, బీజేపీకి 2 మంది, సీపీఐకి 1, సీపీఎంకు 1 సభ్యులు ఉన్నారు. వీరిలో వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ముత్తంశెట్టి కుమార్తె ప్రియాంక ఎవరికి మద్దతు ప్రకటించలేదు. కానీ ఆమె కూడా కూటమికి మద్దతు ఇచ్చినట్టు సమాచారం వినిపిస్తోంది. కూటమికి ఎక్స్-అఫీషియో సభ్యులు 11 మంది ఉండగా. వైఎస్సార్‌సీపీకి ముగ్గురు మాత్రమే మద్దతు ప్రకటించారు. 74 మంది సభకు హాజరైతే సరిపోతుంది. రెండు రోజుల క్రితం వైఎస్సార్సీపీ నేత బెహరా భాస్కరరావు భార్య, కోడలు, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి కూటమి వైపు వచ్చేయడంతో ఆ బలం మరింత పెరిగింది. మొత్తం మీద జీవీఎంసీ మీద కూటమి జెండా ఎగరవేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Chandrababu Naidu
  • AP Deputy CM Pawan kalyan
  • Big ShocK To YSRCP
  • BJP-TDP-JSP
  • GVMC Mayor Seat
  • tdp
  • ys jagan
  • ysrcp

Related News

Vijay is following Jagan once again — Roja

Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

టీవీకే చీఫ్ విజయ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య మరో పోలికను తెచ్చారు మాజీ మంత్రి రోజా. శనివారం ఆమె తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయ్.. వైఎస్ జగన్‌ను ఫాలో అవుతున్నారని రోజా అన్నారు. తమిళనాడు ఎన్నికల సమయం నుంచి జరుగుతున్న ఘ

  • Ap Transport Department

    ఏపీలో వాహనదారులకు గుడ్ న్యూస్ 24 గంటల్లోపే వాహనాల రిజిస్ట్రేషన్‌

  • Varma

    Pithapuram వర్మపై టీడీపీ వేటు

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

  • Ex Union Minister Maneka Gandhi Letter to Chandrababu Naidu

    చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ.. గంగమ్మ జాతరలో జంతు బలులు ఆపండి

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd