YCP : వెయ్యి కోట్లు కొట్టేసిన బినామీ..తలపట్టుకున్న వైసీపీ లీడర్..?
YCP : షాక్ అంటే మాములు షాక్ కాదు ఏకంగా వెయ్యి కోట్లు కొట్టేసి అందుబాటులో లేకుండా పోయాడు
- By Sudheer Published Date - 12:05 PM, Fri - 24 January 25

ఏ రాజకీయ నేతైనా తనకంటూ ఓ నమ్మకమైన వ్యక్తిని బినామీ(Benami )గా పెట్టుకుంటారు. తనకు సంబదించిన ఆస్తిపాస్తులన్నీ కూడా సదరు వ్యక్తి పేరు మీదనే పెట్టి వ్యవహారాలు నడిపిస్తుంటారు. ఒక్కోసారి ఆలా నమ్మిన బినామీలు షాక్ ఇస్తుంటారు. తాజాగా వైసీపీ నేత(YCP Leader)కు కూడా అలాగే ఓ బినామీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. షాక్ అంటే మాములు షాక్ కాదు ఏకంగా వెయ్యి కోట్లు (Thousand Crores) కొట్టేసి అందుబాటులో లేకుండా పోయాడు. ఈ విషయం బయటకు రావడం తో అంత షాక్ లో పడ్డారు.
HMDA Land Auction : హెచ్‌ఎండీఏ భూముల వేలం..ఈసారి సామాన్యులకు..!!
సదరు నేత మాత్రం ఏంచేయాలో తెలియక తలపట్టుకున్నాడు. గడిచిన ఐదేళ్ల తమ హయాంలో సదరు నేత భారీగా డబ్బు వెనకేసుకున్నాడు. ప్రభుత్వంలో కీలక నేత అవ్వడం..అన్ని పనులు తన నుండే జరుగుతుండడంతో కోట్ల రూపాయిలు గుట్టుచప్పుడు కాకుండా పకడ్బందీగా విదేశాలకు తరలించడంలో దిట్ట అయిన వ్యక్తిని బినామీగా పెట్టుకున్నారు. అతని పేరు మీదనే వ్యవహారాలు నడుపుతూ వచ్చాడు. అలా దుబాయ్ కేంద్రంగా ఆ వ్యక్తి ఆ అక్రమ సంపాదనను పెట్టుబడులుగా మారుస్తూ పోయాడు.
ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సదరు బినామీ..తనను నమ్మిన నేతకు షాక్ ఇచ్చాడు. దుబాయ్ నుండి యూరప్ కు మాకాం మార్చేసి.. ఆ లీడర్ పెట్టుబడులు కూడా తన పేరును అక్కడికి మార్చుకుని తనను నమ్మిన వ్యక్తి ఫోన్లకు కూడా అందుబాటులో లేకుండా పోయాడట. అదే సమయంలో అధికార పార్టీ నేతలతో సన్నిహితంగా ఉంటూ.. తన జోలికి రాకుండా చేసుకుంటున్నాడట. ఈ వ్యవహారం వైసీపీతో పాటు టీడీపీలో నూ చర్చనీయాంశం అవుతోంది. ఆ లీడర్ ఎవరన్నదానిపై అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ వ్యవహారం తో అధికార పార్టీ నేతలు కూడా కాస్త అలర్ట్ అవుతున్నారు.