TTD: అన్ని దానాల్లోకెల్లా ‘గుప్త’దానం మిన్న!
సాధారణంగా దానాల గురించి ప్రస్తావన చేస్తే.. ‘అన్నదానం, రక్తదానం, విద్యాదానం’ అని పలువురు పలు రకాలుగా నిర్వచిస్తుంటారు. అయితే ఇదే విషయాన్ని కొంతమంది శ్రీవారి భక్తులను అడిగితే..
- By Balu J Published Date - 04:34 PM, Fri - 10 December 21

సాధారణంగా దానాల గురించి ప్రస్తావన చేస్తే.. ‘అన్నదానం, రక్తదానం, విద్యాదానం’ అని పలువురు పలు రకాలుగా నిర్వచిస్తుంటారు. అయితే ఇదే విషయాన్ని కొంతమంది శ్రీవారి భక్తులను అడిగితే.. ‘‘అన్నిదానాల్లోకెల్లా గుప్తదానం మిన్న’’ అని బదులుస్తారమో.. ఎందకంటే ఓ గుర్తు తెలియని భక్తుడు తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందించాడు. సుమారు రూ.3కోట్ల విలువచేసే బంగారు వరద కటి హస్తాలను అందజేశారు. వజ్రాలు, కెంపులు పొదిగి దాదాపు 5.3 కిలోల బరువు గల ఆభరణాలను టీటీడీ అధికారులకు అందించాడు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి వాటిని అందించారు. అనంతరం భక్తుడిని ఆలయ అధికారుల సత్కరించారు. దాత వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు.
అయితే ఈ గుర్తు తెలియని భక్తుడిలాగే, ఇప్పటికీ ఎంతోమంది భక్తులు డబ్బులు, బంగారు, వెండి లాంటి ఆభరణాలను విరాళాల రూపంలో శ్రీవారికి కానులుగా సమర్పించారు. అయితే పురాణాల ప్రకారం.. ఎవరికైనా దానం చేస్తే.. ఆ వివరాలను బహిర్గతం చేయకూడట. అలా చెప్పుకోవడం వల్ల చేసిన దానానికి విలువ అనేది ఉండదని పెద్దల మాట కూడా. అందుకే తిరుమలకు వచ్చే కొంతమంది భక్తులు సెంటిమెంట్ గా భావించి గుప్తదానం చేస్తుంటారట.