Balineni : బాలినేని రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా..?
- By Sudheer Published Date - 02:11 PM, Fri - 2 February 24

వైసీపీ అధిష్టానానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy) పెద్ద తలనొప్పిగా మారాడని సొంత పార్టీ నేతలు అంటున్నారు. గత కొద్దీ రోజులుగా చీటికిమాటికి అలకపాన్పు ఎక్కుతుండడం తో బాలినేని తీరు మార్చుకోకపోతే ఆయనకే నష్టం అన్నట్లు అధిష్టానం హెచ్చరిస్తుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో బాలినేని తాను చెప్పిన వారికే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో బాలినేని మాటను తీయకూడదనే ఉద్దేశంతో ఎర్రగొండపాలెం లో బాలినేని చెప్పిన అభ్యర్థికే పదవి ఇచ్చారు. కానీ మరో నాల్గు స్థానాల్లో కూడా తాను చెప్పిన వారికే బాధ్యతలు ఇవ్వాలని పట్టుబడుతుండడం తో అధిష్టానం బాలినేని ఫై సీరియస్ గా ఉండి. ముఖ్యంగా ఒంగోలు సీటును మాగంటి కి ఇవ్వాలని బాలినేని పట్టుపడిన ఆ స్థానం మరొకరికి కేటాయించింది అధిష్టానం. దీంతో బాలినేని జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ కు వెళ్లిపోయారు.
We’re now on WhatsApp. Click to Join.
ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ కో – ఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో ఆయన మండిపడుతున్నారు. తన మాట జిల్లాలో చెల్లుబాటు కావడం లేదని ఆయన కొంతకాలంగా అసహనంతో ఉన్నారు. తాను పార్టీలో ఉంటూ సమన్వయంతో ముందుకు వెళుతున్న తన మాటలను అధినాయకత్వం బేఖాతరు చేయడంపై పార్టీ ఫై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాటకు విలువ ఇవ్వని చోట ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అని తన వర్గ నేతలతో చెప్పుకొచ్చారట. పార్టీ లో ఉండడమా..లేక రాజకీయాలకే గుడ్ బై చెప్పడమా అనేది త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తెలిపాడట, మరి బాలినేని ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఇటు పార్టీ నేతలతో పాటు ఆయన వర్గీయులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.
Read Also : Kanigiri MLA : వైసీపీని వీడడం ఫై ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్ క్లారిటీ..