Kanigiri MLA : వైసీపీని వీడడం ఫై ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్ క్లారిటీ..
- By Sudheer Published Date - 01:55 PM, Fri - 2 February 24

వైసీపీ పార్టీ (YCP)లో ఏ నేత ఎప్పుడు రాజీనామా చేస్తున్నారో..ఎవరు ఏ పార్టీ తో టచ్ లో ఉన్నారు..ఎవరికీ టికెట్ వస్తుందో..ఎవరికీ రాదో..ఎవరికీ అర్ధం కావడం లేదు. పార్టీ లో మార్పులు , చేర్పులు చేయాలనీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం..ఇప్పుడు పార్టీ కి పెద్ద తలనొప్పిగా మారింది. సర్వేల్లో ప్రజల నుండి వ్యతిరేకత వచ్చిన నేతలకు ఈసారి టికెట్ ఇవ్వకూడదని జగన్ (Jagan) డిసైడ్ అయ్యారు. ఈ మేరకు చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఖరారు చేయడం లేదు. దీంతో వరుసపెట్టి నేతలు బయటకు వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
వైసీపీ నేతలకు టీడీపీ (TDP) , జనసేన (Janasena) డోర్స్ ఓపెన్ చేయడం తో పెద్ద ఎత్తున నేతలు ఆ పార్టీలలో చేరి టికెట్ ఖరారు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్ (Kanigiri YCP MLA Burra Madhusudan Yadav ) పార్టీ మారబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడం తో ఆ వార్తలపై మధుసూదన్ క్లారిటీ ఇచ్చారు. నేను పార్టీ మారుతున్నాను అని నా పై దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా నన్ను ఎమ్మెల్యేను చేశారు.. నేను జీవితాంతం వైఎస్ జగన్ తోనే ఉంటాను అని స్పష్టం చేశారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి నా ఆరాధ్య దైవం, వైఎస్ జగన్ నా రాజకీయ దైవం అని, పదేళ్లుగా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో నాకు అనుబంధం ఉంది.. అందుకే నాకు టికెట్ రాకపోవడంతో కొంత బాధ పడ్డారని తెలిపారు.. ఇక, పార్టీ అధిష్టానం నియమించిన కొత్త ఇంఛార్జ్ నారాయణ యాదవ్ కు పూర్తి సహకారం అందిస్తాను అని ప్రకటించారు.
Read Also : Bandla Ganesh : మల్లారెడ్డి..విద్యార్థుల రక్తాన్ని పీల్చి పీజులు వసూలు చేస్తున్నాడు – బండ్ల గణేష్