Janasena Formation Day : నా ఆస్తులు జగన్ కాజేసాడు – బాలినేని
Janasena Formation Day : తాను రాజకీయాల్లోకి వచ్చాక తన సొంత ఆస్తిలో సగానికి పైగా పోగొట్టుకున్నానని, కానీ జగన్ మాత్రం తన వియ్యంకుడి ఆస్తిని కూడా కాజేశారని విమర్శించారు
- Author : Sudheer
Date : 14-03-2025 - 8:31 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) ప్రశంసలు కురిపించారు. పవన్ కల్యాణ్ స్వశక్తితో ఎదిగిన నాయకుడని, ఆయన క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల అంకితభావం నిజమైన నాయకత్వ లక్షణాలని పేర్కొన్నారు. పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో బాలినేని మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(Jagan)పై తీవ్ర విమర్శలు చేశారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి దయతోనే జగన్ సీఎం అయ్యారని, కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఎలాంటి కుటుంబ వారసత్వం లేకుండా తన కృషితో ఎదిగారని అన్నారు.
Chiranjeevi : తమ్ముడికి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
తాను రాజకీయాల్లోకి వచ్చాక తన సొంత ఆస్తిలో సగానికి పైగా పోగొట్టుకున్నానని, కానీ జగన్ మాత్రం తన వియ్యంకుడి ఆస్తిని కూడా కాజేశారని విమర్శించారు. తనకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదనే ఉద్దేశంతో తన అనుభవాలను బయటపెడతానని చెప్పారు. వైసీపీ హయాంలో కోట్ల రూపాయలు అవినీతి చేసిన నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జనసేన కార్యకర్తల విషయంలో అన్యాయంగా వ్యవహరించకూడదని, వారికి హక్కుగా పదవులు కేటాయించాల్సిన అవసరం ఉందని అన్నారు.
Honey Trap : పాక్ మహిళా మోజులో పడి భారత్ రహస్యాలు చెప్పిన వ్యక్తి అరెస్ట్
అంతేకాకుండా పవన్ కల్యాణ్‌తో సినిమా తీయాలనేది తన చిరకాల కోరిక అని బాలినేని వెల్లడించారు. పవన్ కల్యాణ్‌ను నిజమైన నాయకుడిగా అభివర్ణిస్తూ, ఆయన తలవంపులు తెచ్చే విధంగా తాను ఏ నిర్ణయమూ తీసుకోబోనని స్పష్టం చేశారు. జనసేనలో తనకు మంచి స్థానం దక్కేలా పోరాడతానని, జనసేన కార్యకర్తల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన నిర్ణయాలతో జనసేన బలోపేతం కావడం ఖాయమని బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.