HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Babu Phone Call To Tdp Candidates

Chandrababu : ఈ 40 రోజులు చాల కీలకం..అభ్యర్థులకు బాబు హెచ్చరిక

  • Author : Sudheer Date : 25-02-2024 - 3:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Teleconference
Chandrababu Teleconference

శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu ) మొదటి జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 94 మందితో కూడిన జాబితాను (TDP List) రిలీజ్ చేసి ఎన్నికల సమరం మొదలుపెట్టారు. తాజాగా టికెట్ దక్కించుకున్న నేతలకు (TDP Candidates) ఫోన్లు చేసి దిశానిర్దేశం చేశారట. ఈ 40 రోజులు చాల కీలకమని, ప్రతి ఒక్కరు ఈ 40 రోజుల్లో ప్రజల్లో ఉండాలని సూచించారట. గెలుస్తామనే ధీమాతో నిర్లక్ష్యం చేయకూడదని , ప్రతి వారం సర్వేలు చేస్తామని , సర్వేలో ఏమాత్రం తేడా కొట్టిన మరొకరు మీ స్థానాల్లో ఉంటారని హెచ్చరించారట. జనసేన కేడర్ ను కలుపుకొని ఎన్నికల ప్రచారం కొనసాగించాలని నిర్దేశించారు. అలాగే టికెట్ దక్కని నేతలను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారట.

We’re now on WhatsApp. Click to Join.

‘పార్టీ అభ్యర్థలును కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశాం. ఇందుకోసం 1.3 కోట్ల మంది నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. అలాగే సర్వేలు పరిశీలించి సుదీర్ఘ కసరత్తు చేసి అభ్యర్థుల ఎంపిక చేశాం. గతంలో ఎప్పుడూ ఇంత ముందుగా అభ్యర్థుల ప్రకటన జరగలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా.. గెలుపే లక్ష్యంగా ఎంపిక జరిగింది. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్ కోసమే టీడీపీ-జనసేన పొత్తు’’.

‘‘ఏ పార్టీలో కూడా ఎప్పుడూ ఇటువంటి ప్రయత్నం జరగలేదు. ఇక ఇప్పుడు ఒక్క సీటూ ఓడిపోవడానికి వీలు లేదు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌కు ఎంతో కీలకం. ఏ స్థాయిలో కూడా చిన్న తప్పు, పొరపాటు జరగకూడదు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకం.. కాబట్టటి నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజలకు భవిష్యత్‌పై నమ్మకం కలిగేలా నాయకత్వం అందించాలి. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించాం.. ఇప్పుడు 99 చోట్ల ఉమ్మడి అభ్యర్థులనూ ప్రకటించాం. జగన్ అహంకారంతో చేసిన విధ్వంసం అతని పతనానికి నాంది అవుతుంది. చరిత్రలో చూడని విధ్వంస పాలకుడైన జగన్‌ను.. ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. ప్రజలతో ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది’ అని చంద్రబాబు అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

Read Also : New York : అమెరికాలో భారత యువ జర్నలిస్ట్ మృతి..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • chandrababu
  • tdp
  • teleconference to candidates

Related News

Chandrababu Naidu

TDP కార్యకర్త ఎప్పుడూ మీసం మెలేసి నిలబడతాడు – CBN

తెలుగుదేశం పార్టీ బలం దాని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలేనని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. "టీడీపీ కార్యకర్త ఎప్పుడూ మీసం మెలేసి నిలబడతాడు తప్ప, ఎవ్వరికీ భయపడడు, ఎక్కడా తలవంచడు" అంటూ కార్యకర్తల ధైర్యాన్ని కొనియాడారు. పార్టీ 1982లో స్థాపించినప్పటి నుంచి ఎన్నో ఆటుపోట్లు చూసిందని

  • Lokesh Tdpworking

    TDP జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ బాధ్యతలు

  • Nara Lokesh

    నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు.. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతల స్వీకారం!

Latest News

  • Toing : వైజాగ్‌లో ‘టోయింగ్’ యాప్ సేవలు ప్రారంభం

  • Toll Plaza : ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగే పనేలేదు !!

  • West Bengal Election : ఆ రెండు నియోజకవర్గాల్లో రీపోలింగ్!

  • Peddi : ఎట్టకేలకు పెద్ది రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

  • US Prepping Iran Attack Again : ఇరాన్ పై మరోసారి దాడికి సిద్దమైన అమెరికా ?

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd